Sun Transit 2023: ఆగస్టు 17 నుంచి ఈ రాశుల వారికి లాభాలతో పాటు నష్టాలు!

Sun Transit 2023 Astrosage: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో జరిగే సూర్య గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 09:04 PM IST
Sun Transit 2023: ఆగస్టు 17 నుంచి ఈ రాశుల వారికి లాభాలతో పాటు నష్టాలు!

 

Sun Transit 2023 Astrosage: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని అన్ని దేవతలకు అధిపతిగా వ్యవహరించే సూర్య భగవానుడిగా భావిస్తారు. కాబట్టి సూర్య గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి సంచారం చేసినప్పుడు కొందరి జాతకాలపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కూడా వస్తాయి. అయితే ఆగస్టు 17న సూర్యగ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు. అంతేకాకుండా జాతకంలో సూర్యుడు ప్రతికూల స్థానంలో ఉన్నవారు కూడా ఈ క్రమంలో తీవ్ర దుష్ప్రభావాల గురవుతారు. అయితే ఈ గ్రహ సంచారం వల్ల ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారు సూర్య గ్రహ సంచారం కారణంగా మిశ్రమ ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రాన్ని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ చేస్తున్నవారు ఈ క్రమంలో తోటి ఉద్యోగుల మద్దతు లభించి పలు లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో భార్య ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు ఉన్నవారికి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే కోపం కారణంగా జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   

వృషభ రాశి:
సూర్యుని సంచార ప్రభావం వృషభ రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు ఈ క్రమంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది లేకపోతే మితిమీరిన కోపం కారణంగా అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి స్నేహితుల మద్దతు లభించి మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు ఆఫీసులో అదనపు బాధ్యత కూడా పొందుతారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం కూడా వస్తుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని దుష్ప్రభావాలు కలిగితే, మరికొన్ని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అధిక కోపంగా కర్కాటక రాశి వారు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులు పెట్టడం మానుకుంటే చాలా మంచిది లేకపోతే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అయితే వీరు ఈ క్రమంలో కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు. దీంతోపాటు స్నేహితుల మద్దతు లభించి అన్ని పనుల్లోనూ సులభంగా విజయాలు సాధిస్తారు.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News