Honor 90 Price: 200MP కెమెరాతో Honor 90 మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..

Honor 90 Price In India: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ Honor 90 త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేయబోతోంది. అతి తక్కువ ధరతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌ను సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 28, 2023, 03:43 PM IST
Honor 90 Price: 200MP కెమెరాతో Honor 90 మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..

Honor 90 Price In India: భారత మార్కెట్‌లో చైనా కంపెనీ స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఒక్కప్పుడు Huawei వంటి కంపెనీ స్మార్ట్‌ ఫోన్లు ఇతర బ్రాండ్‌ మొబైల్‌పై ఎంత ఆధిపత్యం చెలాయించాయో అందరికీ తెలింది. కానీ ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్‌లో కొన్ని రోజుల తర్వాత అదృశ్యమయ్యాయి. అయితే Honor, Huawei రెండు అనుసంధానంగా హై ఎండ్‌ ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ను Honor 90 అనే నామకరణంతో లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ ఎంటో, ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల కాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

హానర్ 90 (Honor 90)సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతోందని కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 45,000 ధరతో ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ హానర్ 90 (Honor 90) మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ వివరాల ప్రకారం..6.7 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో AI మోడ్ సపోర్ట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

200MP కెమెరాతో Honor 90 మొబైల్‌ ఫోన్‌:
పలు నివేదిక అందించిన వివరాల ప్రకారం..Honor కంపెనీ అత్యంత శక్తివంతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ ఫోన్‌గా Honor 90ని విడుదల చేయబోతోందని సమాచారం. ఈ ఫోన్ ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉండబోతోందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 200MP బ్యాంక్‌ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌:
హానర్ 90 స్మార్ట్‌ఫోన్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల ఆప్షన్స్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దూర ప్రదేశాలను చిత్రికరించేందుకు 10X డిజిటల్ జూమ్ ఆప్షన్‌ కూడా కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే..4900mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉండబోతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు..చాలా రకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News