Bank Holidays in August: ఆగస్టు నెల బ్యాంకు సెలవులు ఎప్పుడో చూసుకున్నారా, 14 రోజుల సెలవులు

Bank Holidays in August: జూలై నెల ముగుస్తోంది. మరో ఐదురోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ఆగస్టు నెలలో బ్యాంకు పనులుంటే తస్మాత్ జాగ్రత్త. దాదాపు సగం రోజలు బ్యాంకులు పనిచేయవు. ఆ జాబితా ఇలా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2023, 02:42 AM IST
Bank Holidays in August: ఆగస్టు నెల బ్యాంకు సెలవులు ఎప్పుడో చూసుకున్నారా, 14 రోజుల సెలవులు

Bank Holidays in August: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా దేశంలోని బ్యాంకుల సెలవుల్ని విడుదలు చేస్తుంటుంది. ఈ సెలవుల్లో ప్రాంతీయ, జాతీయ సెలవులతో పాటు పబ్లిక్ హాలిడేస్ ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు ఆగస్టు నెల సెలవుల గురించి తెలుసుకుందాం..

ఆగస్టు నెల మరో ఐదు రోజుల్లో ప్రారంభమౌతోంది. ఈ క్రమంలో వచ్చె నెలలో బ్యాంకుకు వెళ్లాల్సిన పనులుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఆగస్టు నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు పనిచేయవు. ఆగస్టులో  బ్యాంకులకు 14 రోజులు మూతపడి ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంక్ సంబంధిత పనులుంటే ఈ సెలవుల్ని బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆర్బీఐ విడుదల చేసిన ఆగస్టు బ్యాంకు సెలవుల జాబితాలో నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగవ శనివారాలున్నాయి. 

ఆగస్టు 6                                               ఆదివారం
ఆగస్టు 8                                              సిక్కిం జోన్‌లో సెలవు
ఆగస్టు 12                                            రెండవ శనివారం
ఆగస్టు 13                                            ఆదివారం
ఆగస్టు 15                                            ఇండిపెండెన్స్ డే
ఆగస్టు 16                                            పార్సీ న్యూ ఇయర్ డే, ముంబై, నాగపూర్, బేలాపూర్‌లో సెలవు
ఆగస్టు 18                                            బ్యాంకు సెలవు
ఆగస్టు 20                                            ఆదివారం
ఆగస్టు 26                                            నాలుగవ శనివారం
ఆగస్టు 27                                            ఆదివారం
ఆగస్టు 29                                            తిరుఓణం పండుగ, కొచ్చి, త్రివేండ్రంలో సెలవు
ఆగస్టు 30                                            రక్షా బంధన్ జైపూరా్, సిమ్లాలో సెలవు
ఆగస్టు 31                                            డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో,తిరువనంతపురంలో సెలవు    

మొత్తానికి ఆగస్టు నెలలో బ్యాంకులు 14 రోజులు పూర్తిగా పనిచేయవు. అన్ని ప్రాంతాల్లో 14 రోజులు సెలవులుండవు. కొన్ని ప్రాంతాల్లో 11-12 రోజులే సెలవులుండవచ్చు. అయితే ఏటీఎం లావాదేవీలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పనులు యధేఛ్చగా కొనసాగుతాయి.

Also read: Vande Bharat: వందేభారత్‌లో కొత్తగా ఆ సౌకర్యం, ప్రారంభం కానున్న స్లీపర్ కోచ్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News