Telangana, AP Rains News Live Updates: వరద బీభత్సం.. వేల ఎకరాలు జలమయం

Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పలు చోట్ల చెరువులు, కుంటల కట్టలు తెగి రోడ్ల మీది నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 

Written by - Pavan | Last Updated : Jul 28, 2023, 11:11 PM IST
Telangana, AP Rains News Live Updates: వరద బీభత్సం.. వేల ఎకరాలు జలమయం
Live Blog

Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాపాతం నమోదవుతుండగా.. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలు భారీ వర్షాలకు తడిసి ముద్దయి వీధులు సైతం నదులను తలపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో మరో రెండు రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ నివేదికలకు తగినట్టుగానే రెండు రాష్ట్రాల్లోను అక్కడక్కడ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అనేక ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలకు సంబంధించిన మరిన్న వార్తలు, వీడియోల కోసం ఈ లైవ్ బ్లాగ్ పేజీని అనుసరించండి.

28 July, 2023

  • 23:07 PM

    భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష -  సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు ఆదేశాలు

    kcr-reveiw-meeting.jpg

    రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసిన సీఎం కేసీఆర్.  

    మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సూచనలిస్తూ సమన్వయం.

    రక్షణ, పునరావాస, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు.

    సీఎం కేసీఆర్ స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తుండటంతో అప్రమత్తంగా అధికార యంత్రాంగం.. సహాయక బృందాలు.

    సీఎం ఆదేశాలతో పునారావాస కేంద్రాల్లో విస్తృతంగా సౌకర్యాలు.

    సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు వైద్యం, వసతి, భోజన సదుపాయాలు.

    వరద ముంపు తగ్గి కుదుట పడుతున్న ప్రాంతాల్లో అంటు వ్యాధుల నిరోధానికి చర్యలు చేపట్టాలని ఆదేశం.
     

  • 21:53 PM

    కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురి సస్పెండ్
    జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులలో ప్రత్యేక విధులు కేటాయించిన ముగ్గురు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పొంగుతున్న వాగులు, నదుల వద్ద ప్రజారక్షణ కొరకు నియమించిన తుంపెల్లి పంచాయితీ కార్యదర్శి, వి. ఆర్. ఏ. ల అలసత్వం కారణంగా 8 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడని, ఈ కారణంగా వీరితో పాటు కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జనకాపూర్ వి. ఆర్. ఏ. ను ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం-2005 క్రింద సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

  • 20:09 PM

    తెలంగాణలో నేడు వర్షం కాస్త కరుణించినా.. వరద బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా.. అంతా బురదే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
     

  • 16:27 PM

    శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ వివరాలు..
    FRL 1091 అడుగులు/332.53 M/90.3 TMC

    ఈరోజు తేదీ: 28-07-2023
    సమయం: 4.00 PM
     
    నీటి మట్టం: 1089.0 అడుగులు
    కెపాసిటీ: 79.620 TMC
    -------------------
    మొత్తం తక్షణ ప్రవాహాలు: 1,75,000 c/s
    1) గోదావరి :1,75,000 c/s
    2) SRSP-PP-PH@MPKL: 0
    ----------------------------------
    మొత్తం తక్షణ అవుట్‌ఫోలు 128000 c/s
    1) RC గేట్స్(26 సంఖ్యలు): 120000 c/s
    2) ఎస్కేప్/GEN: 8000 c/s

  • 15:53 PM

    భారీ వర్షాలతో ములుగు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలోనే పర్యటించి.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు.

     

  • 21:38 PM

    భారీ వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

    KTR-review-meeting-on-heavy-rains-and-floods.jpg

    రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష.

    హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్.

    హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్. 

    హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి కేటీఆర్.

    ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు. 

    ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించిన కేటీఆర్. 

    లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని సూచన. 

    వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతాం. 

    శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలి.

  • 20:32 PM

    మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

    ఖమ్మం మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మున్నేరు ప్రాంతంలో ఓ ధ్యానమందిరంలో ఏడుగురు చిక్కుకుపోయారు. విషయం మీడియా ద్వారా తెలుసుకున్న‌ సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ సైతం అజయ్ కుమార్ తో మాట్లాడి మున్నేరు వాగు బాధితుల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. దీంతో భద్రాచలం గోదావరి వరద పరిస్థితిని పరీశీలించడానికి వెళ్లిన మంత్రి పువ్వాడ హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. విశాఖపట్నం నుండి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలతో శ్రమించి మున్నేరు వాగు బాధితులను రక్షించారు. అంతకంటే ముందు బాధితులు గంటల తరబడి వరద ఉధృతిలోనే చావు భయంతో గడపాల్సి వచ్చింది. 

  • 19:35 PM

    నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి క్షేత్ర స్థాయి పరిస్థితులు,సహాయక చర్యలపై సీఎం కేసిఆర్ ఆరా తీసారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. అధైర్యపడవద్దు..భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల మధ్య ఉండమని..మీకు నేనున్నా అంటూ సీఎం కేసిఆర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం వేకువ జామున నుండే నిర్విరామంగా బాల్కొండ నియోజకవర్గం అంతటా పోలీసు బస్సులో తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

  • 18:37 PM

    మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురు

    ఖమ్మంలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం 

    మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్..

    మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. 

    వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశం. 

    సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 

    మరి కాసేపట్లో మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తామన్న పువ్వాడ.. 

    విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశం. 

    ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని ఆరా తీస్తున్న ఖమ్మం అధికారులు.

  • 14:00 PM
  • 13:42 PM

    హైదరాబాద్ శివారులో మూసినదీ ఉదృతంగా ప్రవహిస్తుంది

    నిన్న రాత్రి నుండి కోస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి మూసి లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ కొర్రెముల వద్ద వంతెన మీదుగా, హయత్ నగర్ వెళ్లే మార్గం నిర్మించిన వంతెన వద్ద మూసి నీటి ప్రవాహం కొనసాగుతుంది.

     

  • 13:41 PM

    భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో  జాతీయ రహదారిపై  వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపైసమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన మంత్రి సత్యవతి రాథోడ్ మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. స్థానికులు, వాహనదారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా మంత్రి సూచించారు. రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలను కోరారు.

     

  • 11:42 AM

    కూలిన బ్రిడ్జి.. ఆగిన రాకపోకలు..

    మహబూబ్ నగర్ నుండి రాయచూరు వెళ్లవలసిన ప్రయాణికులు వేరే మార్గం చూసుకోండి.. ఎందుకంటే దేవసూర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి నేటి ఉదయం కూలిపోయింది..అటువైపు వెళ్లే వాళ్ళు అప్రమత్తంగా ఉండి అటు వైపు వెళ్ళేవాళ్ళు ప్రత్యామ్నాయ దారి చూసుకొని వెళ్ళండని స్థానికులు, అధికారులు చెబుతున్నారు.
     

  • 11:38 AM

    జల దిగ్బంధనంలో మోరంచపల్లె - మరొకరు గల్లంతు

    వరద నీటిలో చిక్కుకున్న మొరంచ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బస్సులను వాటర్ బోట్లను ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం

    మోరాంచ పల్లి గ్రామంలో సహాయక చర్యలు చేపడుతున్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా,ఎం ఎల్ ఏ గండ్ర రమణా రెడ్డి,యెస్ పి,కరుణాకర్, మరియు,సిబ్బంది


    భూపాలపల్లి జిల్లాలో వరద ప్రవాహంలో ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు కొట్టుకుపోగా, తాజాగా మరో మహిళ గల్లంతు అయ్యింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ గ్రామానికి బయల్దేరాయి. అధికారులు ములుగు నుంచి బోట్లు తెప్పిస్తున్నారు. నీట మునిగిన మోరంచపల్లె గ్రామ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటిస్తున్నారు.

  • 09:40 AM

    జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద

    రెండు గేట్లు ఎత్తివేత

    ఇన్ ఫ్లో: 48,000 క్యూసెక్కులు
    ఔట్ ఫ్లో: 55,856 క్యూసెక్కులు 

    పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు..
    ప్రస్తుత నీటి నిల్వ 9.234 టీఎంసీలు

    జూరాల ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 8 యూనిట్లలో 316  మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి

  • 09:35 AM

    క‌డెం ప్రాజెక్ట్ అప్డేట్స్

    ==> ఇన్ ప్లో 3. 85 ల‌క్ష‌ల క్యూసెక్

    ==> అవుట్ ప్లో 2.42 ల‌క్ష‌ల క్యూసెక్
     
    ==> మోరాయించిన నాలుగు గేట్లు 

    ==> జ‌ర్మ‌న్ క్ర‌స్ట్ గేట్లపై నుంచి పారుతున్న వ‌ర‌ద‌నీరు

    ==> మ‌రికాసేప‌ట్లో కడెం ప్రాజెక్ట్ కు చేరుకోనున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

    ==> క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న ఎమ్మెల్యే రేఖా నాయ‌క్, క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి

    ==> లోత‌ట్టు ప్రాంతాల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కలెక్ట‌ర్ కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశం

    ==> ఇప్ప‌టికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాల‌కు త‌ర‌లింపు

  • 17:26 PM

    భద్రాచలం వద్ద  పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఈ రోజు సాయంత్రం 4:50 గంటలకు  46.1 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక  జారీ చేసిన అధికారులు.. 

     

     

  • 12:29 PM

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం 
    జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉస్మాన్ సాగర్ కాలనీలో భారీగా వరధ నీరు.  ఇల్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్న జనాలు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి జల్పల్లి చెరువు పూర్తిగా నిండి వరద పూర్తిగా కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో చెరువుకు అతి దగ్గరలో ఉన్న ఉస్మాన్ సాగర్ కాలనీలో రోడ్లోని జలమయం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండి మురికి నీరంతా రోడ్లపైకి వచ్చి కాలనీలోని పలు ఇళ్ళల్లో చేరుతున్నాయి. దీంతో కాలనిలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

     

  • 12:24 PM

     Dated : 26. 07. 2023 

     తెలంగాణా రాష్ట్రంలో  రాగల మూడు రోజుల  వరకు   వాతావరణ విశ్లేషణ మరియు  వాతావరణ హెచ్చరికలు : 

     ♦ వాతావరణ విశ్లేషణ Meteorological Analysis  : (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా) :  

    నిన్నటి తీవ్రఅల్పపీడనం ఈ రోజు కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిస్సా తీరాల్లోని,  పశ్చిమ మధ్య మరియు పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. తీవ్రఅల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుంది.
     ఈ తీవ్ర అల్పపీడనం   వాయువ్య దిశగా  నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలను చేరుకునే అవకాశం ఉంది.

    రుతుపవన ద్రోణి ఈ రోజు  జైసల్మేర్, కోట, రైజన్, మాండ్ల, దుర్గ్, పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

    ఈ రోజు  షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.

    ♦ రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 

    రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. 

      ♦ వాతావరణ హెచ్చరికలు 
     (weather warnings) 

     ఈ రోజు, రేపు భారీ వర్షములు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షములుతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో  అక్కడక్కడ  వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఎల్లుండి భారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో  అక్కడక్కడ  వచ్చే అవకాశాలు ఉన్నాయి.
    (2 రోజులు RED అలెర్ట్ )

     రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

              -----–-----------
               సంచాలకులు 
     హైదరాబాద్ వాతావరణ కేంద్రం

     

  • 18:38 PM

    ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసు శాఖ డైరెక్షన్స్

    వర్షాల కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశల వారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సూచించిన సైబరాబాద్ పోలీస్ శాఖ.

    ఫేజ్ - 1 
    ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

    ఫేజ్ - 2 
    ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

    ఫేజ్ - 3 
    ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

  • 18:30 PM

    కృష్ణానది 
    ఆల్మట్టి దగ్గర కృష్ణా నదికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న1.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఇవ్వాళ ఉ. 6 గం. ల సమయానికి 1.16 లక్షలుగా నమోదైంది. కృష్ణ జన్మస్థానం మహాబలేశ్వర్ లో 6 సెం. మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు కృష్ణా ఉపనది తుంగభద్రకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

    తుంగభద్ర నది
    తుంగభద్రకు నిన్న 47 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఇవ్వాళ 73 వేలకు పెరిగింది. క్యాచ్‌మెంట్‌లో కురుస్తున్న భారీ వర్షాలను బట్టి రేపటికి లక్ష క్యూసెక్కులు దాటొచ్చని రాయలసీమ జలవనరుల నిపుణుడు సింగంరెడ్డి రామచంద్రా రెడ్డి అంచనా వేశారు. 101 టిఎంసీల తుంగభద్రలో ప్రస్తుత నీటి నిల్వ 32 టీఎంసీలకు చేరింది.

    గోదావరి నది
    90 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్‌లో నీటి నిల్వ 64 టీఎంసీలకు పెరిగింది. అక్కడ ప్రస్తుత ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 9.11 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

  • 18:22 PM

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు - ఉదృతంగా ప్రవహిస్తోన్న వాగులు
    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అత్యధికంగా వేల్పూరు మండలంలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, భీంగల్‌లో 32 సెంటీమీటర్లు, జక్రాన్‌పల్లిలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలకు వేల్పూరు మండలంలోని మోసర్ చెరువు కట్ట తెగగా, వేల్పూరు పోలీస్ స్టేషన్ ముందు గల డివైడర్ మధ్యలో కూలిపోయింది. భీంగల్‌లోని కప్పల వాగు, రాళ్ళవాగులు పొంగిపొర్లుతున్నాయి. భీంగల్ అయ్యప్పనగర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మోర్తాడ్ మండలం ధర్మోరా బ్రిడ్జి కింద చిన్నవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటిలో ఇద్దరు వన్నేల్ గ్రామానికి చెందిన వారు చిక్కుకోగా వారిని గ్రామస్తులు రక్షించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • 18:18 PM

    కిన్నెరసాని 2 గేట్లు ఎత్తివేత
    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 1000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో నీటిమట్టం 402.70 అడుగులకు పెరిగింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు 2 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. నీటి విడుదలతో రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య చప్టాపై ఉధృతంగా ప్రవహించగా 24 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

  • 18:14 PM

    వరంగల్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
    వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తోడు రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది ఎక్కడికక్కడ చెరువులు అలుగు పోస్తుండడంతో పాటు నగరంలోని వివేకానంద కాలనీ, శివనగర్, ఎస్సార్ నగర్ సాయి గణేష్ కాలనీ ఎన్టీఆర్ నగర్ లాంటి పలు ప్రాంతాలలో వర్షపు నీరు ఇండ్లలో చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని చౌరస్తా, బట్టల బజార్ పోచమ్మ మైదాన్ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వడ్డేపల్లి భద్రకాళి చెరువు వర్షపునీరుతో అలుగు పోస్తున్నాయి.

  • 18:12 PM

    ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
    ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. భారీ వర్షాలకు సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 38,000 వేలు టన్నుల బొగ్గు ఉత్పత్తికి 2,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఓపెన్ కాస్ట్ అధికారులు చెబుతున్నారు. ఓపెన్ కాస్ట్‌లోకి నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయని వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని తెలిపారు.

Trending News