Axis Bank Magnus Credit Card New Rules: యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు చేసింది. మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌ల విషయంలో నిబంధనలు, షరతులను సవరించింది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు యాక్సిస్ బ్యాంక్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం అందించింది. వార్షిక రుసుమును రూ.10,000+జీఎస్టీ నుంచి రూ.12,500+GST కి పెంచినట్లు తెలిపింది. అంతేకాకుండా EDGE రివార్డ్ పాయింట్లకు కొత్త నిబంధనలను కూడా బ్యాంక్ ప్రతిపాదించింది. కొన్ని రోజుల క్రితం యాక్సిస్ బ్యాంక్ తన రిజర్వ్ క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నిబంధనలు, షరతులను కూడా సవరించిన విషయం తెలిసిందే.
వెల్‌కమ్ బెనిఫిట్స్ ఇలా..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్-బోర్డ్ అయిన కస్టమర్‌లు ఈ కింది వాటిలో రూ.12,500 విలువైన ఏదైనా ఒక వోచర్‌ని ఎంచుకోవచ్చు.
==> విలాసవంతమైన బహుమతి కార్డ్
==> పోస్ట్ కార్డ్ హోటల్స్ గిఫ్ట్ వోచర్
==> యాత్ర గిఫ్ట్ వోచర్
==> Tata CLiQ వోచర్‌ని ఎంచుకునే ఆప్షన్ నిలిచిపోనుంది.
వార్షిక ఛార్జీలు ఇలా..
కస్టమర్‌లకు వార్షిక రుసుము రూ.10,000+GST నుంచి రూ.12,500+GSTకి అప్‌డేట్ అవుతుంది. అదేవిధంగా రూ.10 వేల విలువైన వార్షిక బెనిఫిట్ వోచర్ నిలిచిపోనుంది. ఏడాది లిమిట్ స్టాటస్ ఫీజు మినహాయింపు స్టాటస్ అప్‌డేట్ అవుతుంది. ఏడాదిలో రూ.25 లక్షల ఖర్చుపై రూ.12,500 ఫీజు మినహాయింపు పొందుతారు. 1 సెప్టెంబర్ 2023లోపు ఆన్‌బోర్డ్ చేసిన కస్టమర్‌లకు పాత కార్డ్ వార్షికోత్సవ సంవత్సరంలో రూ.15 లక్షల ఖర్చులపై వార్షిక ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
EDGE రివార్డ్ పాయింట్లపై కొత్త నిబంధనలు ఇలా..
నెలవారీ రూ.లక్ష ఖర్చులపై 25 వేల EDGE రివార్డ్ పాయింట్‌ల మైల్‌స్టోన్ ప్రయోజనాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఆగస్టు నెలలో చేసిన ఖర్చులు నెలవారీ ఖర్చులకు రివార్డు పాయింట్లు పొందుతారు. ఇవి 90 రోజులలో క్రెడిట్ అవుతాయి. మే, జూన్ నెలలకు సంబంధించి 25 వేల EDGE రివార్డ్ పాయింట్‌లు జూలై 31న క్రెడిట్ అవుతాయి. జూలై నెలకు సంబంధించిన రివార్డ్ పాయింట్‌లు ఆగస్టు 10న పోస్ట్ అవుతాయి.
Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!