AP Government:పీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య ఒక్కొక్కటిగా పరిష్కారమౌతోంది. అందుకే ఉద్యోగులు సమ్మె బాటను వీడి విధుల్లో కన్పిస్తున్నారు. మరోవైపు వీఆర్ఏ, వీఆర్వోలకు చెందిన డీఏను సైతం విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఏపీలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న కోల్డ్ వార్ దాదాపుగా సమసిపోయినట్టే. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేదిశగా హామీ ఇవ్వడంతో ఇరువురి మధ్య ఇటీవల జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇప్పుడు తాజాగా వీఆర్ఏ, వీఆర్వోలకు చెల్లించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం శుభవార్త విన్పించింది. డీఏ విడుదలకు సానుకూలంగా స్పందించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తేలింది.
రాష్ట్రంలోని వీఆర్ఏ, వీఆర్వోలకు2018 జూలై నుంచి డీఏ నిలిచిపోయింది. 2018-2020 వరకూ చెల్లించిన 1 కోటి రూపాయల్నిసైతం రికవర్ చేయనుందనే వార్తలు విన్పించాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగ సంఘ నేతలు. మరోవైపు అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతి కలగనుంది. వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది.పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని, విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు.
మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు తుదిదశలో ఉందని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశం పరిశీలిస్తున్నామన్నారు.
Also read: AP Medical Colleges: ఏపీలో 5 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎన్నెన్ని కేటాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook