Diabetic problems: ఆధునిక జీవనశైలిలో మధుమేహం , కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి వ్యాధులు ముప్పు వెంటాడుతుంటుంది. సకాలంలో తగిన జాగ్రత్తలతో ఎలా పరిరక్షించుకోవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరమౌతుంది. అందుకే డయాబెటిస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వైద్యులు.
ఇటీవలి కాలంలో అధిక శాతం ప్రజానీకం మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్ కారణంగా ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ఒకటి డయాబెటిస్ రెటినోపతి. డయాబెటిస్ రోగుల కళ్లను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్ రుగ్మత ఎంత ప్రమాదకరమైందంటే ఇతరత్రా వ్యాధులకు దారి తీస్తుంటుంది. శరీరంలోని అంగాలను నష్టపరుస్తుంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంటుంది. ఎన్నో రకాల ఇతర వ్యాధులకు కారణం ఇదే. రక్తంలో చక్కెర శాతం పెరిగితే కంటి వెలుగు తగ్గిపోతుంటుంది. దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారు.
డయాబెటిక్ రెటినోపతి వ్యాధి చాలా తీవ్రమైంది. డయాబెటిస్ రోగుల కళ్లను ప్రభావితం చేస్తుంటుంది. డయాబెటిక్ రెటినోపతిలో రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా రెటీనా బలహీనమైపోతుంది. ఈ సమస్యలో రక్త నాళాల్లో వాపు కన్పిస్తుంది. దాంతో కంటి చూపు మందగిస్తుంది. కంటి వెలుగు తగ్గుతుంది
డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు
కళ్ల ముంందు మచ్చలు కన్పించడం, మసక మసకగా ఉండటం, డబుల్ ఇమేజ్ కన్పించడం, కళ్లలో నొప్పి ఉండటం, రంగుల్ని గుర్తించలేకపోవడం, తల తిరగడం, తలనొప్పి సమస్య ప్రధానంగా ఉంటాయి.
డయాబెటిక్ రెటినోపతి కారణాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. స్క్రీనింగ్, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించడం, రక్తంలో షుగర్ స్థాయి పెరగడడం, రక్తపోటు పెరుగుతుండటం, మద్యం, సిగరెట్ స్మోకింగ్.
డయాబెటిక్ రెటినోపతికి నిర్ణీత పద్ధతిలో చికిత్స చేయిస్తే పరిష్కారముంటుంది. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు కూడా నియంత్రించుకోవాలి. హెల్తీ లైఫ్‌స్టైల్ చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు వ్యాయామం అవసరం.
Also read: Weight loss Exercise: పొట్ట, నడుము చుట్టూ కొవ్వు కరిగించే 10 సులభమైన వ్యాయామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook