Vangalapudi Anitha Comments on YS Bharathi, Sajjala Bhargav Reddy: వైజాగ్: వైసిపికి మహిళలపై గౌరవం లేదు అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు దేశం పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వైసిపి ఎదురుదాడికి దిగుతోందన్నారు. టిడిపికి చెందిన మహిళా నేతలతో పాటు ఇతర పార్టీల మహిళలను కించ పరిచేలా వాఖ్యలు చేస్తున్నారు. మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు అని చెప్పమంటే చెప్పలేరు కానీ స్త్రీ జాతి వినలేని మాటలు మాట్లాడుతున్నారు అని అసహనం వ్యక్తంచేశారు. తనపై సైతం అత్యంత హేయమైన వ్యాసాలు రాసి భాద పెడుతున్నారు. నోటికి వచ్చిన దారుణమైన పదజాలం వినియోగిస్తున్నారు అని అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనిత ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతినే స్వయంగా తనపై కూడా అనేక జుగుప్సాకరమైన రాతలు రాయిస్తోంది అని వంగలపూడి అనిత ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డినే సోషల్ మీడియాలో ఈ రాతలు రాయిస్తున్నారు అని అన్నారు. ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి రాతలు ఎలా రాస్తారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేసిన అనిత.. తాను ఈ విషయాల మీద ఫిర్యాదు చేయడానికని ఏపీ డిజిపి అపోయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు అని తెలిపారు.
సీఎం జగన్‌ని ప్రశ్నించడమే తాను చేసిన తప్పా అని తాను ఎంతో బాధపడ్డానని అనిత మీడియాకు తెలిపారు. అయినా సరే తాను ఏడవనని.. ఎందుకంటే తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని ఏడిపించే రోజు వస్తుందని అన్నారు. చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను. నాకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. మహిళా సమస్యల మీద మేము పోరాటం చేస్తుంటే వైసిపి సోషల్ మీడియా గజ్జి కుక్కలు మొరుగుతున్నాయి. పేటిఎం డాగ్స్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. అసభ్యపదజాలం వాడుతూ ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నాయన్న వంగలపూడి అనిత.. ఒక మనిషికి పుట్టిన వాడు ఇలా చేయడు అంటూ ఘాటైన పదజాలంతో కౌంటర్ ఇచ్చారు.
ఊరు, పేరు లేని పేపర్లలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు. తన మీద రాయిస్తున్నది భారతీ రెడ్డియే. ఇదంతా సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జరుగుతోంది అని అనిత ఆరోపించారు. ప్రొఫైల్ పిక్‌లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాల్సింది పోయి నా ఫోటో పెట్టుకుంటున్నారు. తన మీద అసత్య ప్రచారం చేస్తూ అభ్యంతకరమైన వార్తలు ప్రచురిస్తున్నారు. తాను ఎవర్ని వదిలిపెట్టను. డిజిపి 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి పోస్టులకు ఏడిచేది లేదు.. ఏడిపిస్తాను.. 6 నెలలు ఆగండి. జగన్ జైలులో ఉంటారు. పోలీసు వ్యవస్థ మా దగ్గర ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. వదిలే ప్రసక్తే లేదు. తాను చదువుకున్న దళిత ఆడ బిడ్డను అని గుర్తుచేసిన అనిత.. మీరు పెడుతున్న పోస్టులకు భయపడను నా కొడకల్లారా.. మీ ఇష్ట వచ్చినట్లు పోస్టులు పెట్టండి. ఇంకా పెట్టండి.. బెదిరేది లేదు అని సవాల్ విసిరారు.
ఏపీ డీజీపీ ఎలాగూ అపాయిట్మెంట్ ఇవ్వడం లేదని.. కనీసం ఏపీ పోలీసులు తనపై అసభ్యపదజాలంతో రాస్తోన్న సోషల్ మీడియా రాతలపై సుమోటోగా కేసు తీసుకోవాలి అని ఏపీ డిజిపికి అనిత విజ్ఞప్తి చేశారు.
తప్పుడు పోస్టులు పెట్టేవాడు దొరికితే ఇక నుంచి తంతాము. సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు. సొంత చెల్లికే దిక్కు లేదు. మేము ఎంత అని అన్నారు. హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళల సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు అని అన్నారు వంగలపూడి అనిత ఆరోపించారు.