Bollywood Actors Love Affairs: విడాకుల తరువాత ప్రేమలో పడ్డ బాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా

Bollywood Actors Love Affairs: సినీ పరిశ్రమలో వైవాహిక బంధాలు క్షణకాలికమనే చెప్పాలి. ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు ఎవరితో కలిసిపోతారో చెప్పలేని పరిస్థితి. లివ్ ఇన్ రిలేషన్లు, రెండవ పెళ్లిళ్లు ఇలా చాలానే జరుగుతుంటాయి. విడాకుల తరువాత కూడా మరొకరితో ఆనందంగా జీవిస్తున్న జంటలూ ఉన్నాయి.

Bollywood Actors Love Affairs: బాలీవుడ్ నటుల్లో చాలామంది విడాకులు తీసుకున్న తరువాత ప్రేమలో పడుతున్నారు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు ఏ వయస్సులో అవుతుందో చెప్పలేని పరిస్థితి. విడాకుల తరువాత కూడా ఆనందకరమైన జీవితం ఉంటుందని చెబుతున్నారు వీరంతా..
 

1 /5

సైప్ అలీ ఖాన్-కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ విడాకుల అనంతరం కొద్దికాలం ఓ విదేశీ మోడల్‌తో ప్రేమలో ఉన్నాడు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత సైఫ్ జీవితంలో కరీనా కపూర్ ప్రవేశించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు.

2 /5

సబా ఆజాద్-హృతిక్ రోషన్ హృతిక్ రోషన్, సబా ఆజాద్ జంట గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. గత ఏడాదే ఈ ఇద్దరి ఎఫైర్ గురించి బయటికి తెలిసింది. ఇప్పుడీ ఇద్దరి పెళ్లి కూడా దాదాపుగా నిశ్చయమైనట్టేనట. 2014లో హృతిక్ రోషన్ మొదటి భార్య సుజైన్‌తో విడాకులైంది.

3 /5

ఫర్హాన్ అఖ్తర్-షిబానీ ఫర్హాన్ అఖ్తర్ గత ఏడాది షిబానీ దాండేకర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఫర్హాన్ అఖ్తర్‌కు ఇది రెండవ పెళ్లి. రెండవ పెళ్లితో చాలా సంతోషంగా ఉన్నాడట.

4 /5

అర్జున్ రాంపల్-గేబ్రియేలా డెమోట్రియడ్స్ ప్రస్తుతం ఈ ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి కాకుండానే గేబ్రియేలా తల్లి అయింది. అయినా ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఆనందంగా జీవిస్తున్నారు.

5 /5

అర్బాజ్-జార్జియా ఏండ్రియానీ అర్బాజ్ ఖాన్ , మలైకా అరోరా విడాకులు 2017లో అయ్యా.యి. ఆ వెంటనే విదేశీ మోడల్ జార్జియా ఏండ్రియానీతో కలిసి జీవించాడు. ఇటీవలే ఈ ఇద్దరికీ కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.