Delhi Meerut Expressway Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్ రూట్లో వెళ్లిన స్కూలు బస్సు.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లాల్ కువాన్ నుంచి ఢిల్లీ వెళ్లే లేన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎస్యూవీ కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ఏడీసీపీ (ట్రాఫిక్) ఆర్కే కుష్వాహ మాట్లాడుతూ.. ఆరుతగురు అక్కడికక్కడే మరణించారని.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. బస్సు డ్రైవర్ సీఎన్జీని తీసుకొని రాంగ్ రూట్లో వస్తున్నాడని.. కారు మీరట్ వైపు నుంచి వస్తోందన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ తప్పిదమే కారణమన్నారు. ఢిల్లీ నుంచి రాంగ్ రూట్లోనే వస్తున్నాడని తెలిపారు. అతన్ని పట్టుకుని విచారిస్తున్నామన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. స్కూలు బస్సులో విద్యార్థులు లేరని చెప్పారు.
This bus was driving on the wrong side of the Delhi-Meerut Expressway. Car rammed into a bus, 6 people are killed. The bus driver must be charged for murder.
Very tragic incident #BusAccident #caraccident pic.twitter.com/r8PTpoUNdd
— विवेक सिंह नेताजी (@INCVivekSingh) July 11, 2023
రాంగ్ రూట్లో వచ్చిన బస్సు ఢీకొనడంతో కారులో ఉన్నవారు తేరుకునే అవకాశం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలు కారులో చిక్కుకుపోయాయని.. గ్యాస్ కట్టర్లతో కోసి మృతదేహాలన్నింటినీ బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు ఖాళీగా ఉందని.. అందులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరని స్థానికులు వెల్లడించారు.
మృతులు మీరట్‌లోని మవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చెందిన వారిగా గుర్తించారు. వీరు కుటుంబం అంతా కలిసి ఖతు శ్యామ్‌ను సందర్శించడానికి వెళుతున్నారు. TUV వాహనంలో నలుగురు, నలుగురు పిల్లలు వెళుతున్నారు. ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై విజయ్ నగర్ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్లో వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి