MLA Rajaiah Vs Sarpanch Navya: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యకు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన సీడీఎఫ్ నిధుల నుండి 25 లక్షల రూపాయల ఫ్రోసిడింగ్ కాపీని గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపించారు. ఈ సందర్భంగా జానకీపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ కుర్సపల్లి నవ్య మాట్లాడుతూ.... గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటి వరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని అన్నారు. గతంలో జరిగిన గొడవలో ఎమ్మెల్యే రాజయ్య తనకు క్షమాపణలు చెప్పారని, అప్పుడు మా ఇంటికి వచ్చి గ్రామాభివృద్ధికి రూ 25 లక్షల సీడీఎఫ్ నిధులు ఇస్తానని మాట ఇచ్చి వెళ్లారు అని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నిధులు ఇవ్వడం మర్చిపోయాడని సర్పంచ్ నవ్య గుర్తుచేశారు.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు, తనకు మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు, విబేధాలు, వేధింపులు వంటి అన్ని పరిణామాలను ఉద్దేశించి సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితానికి, రాజకీయానికి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేత, ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యపై తాను చట్టప్రకారం పోరాడతానని అని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమీషన్ ద్వారా ఎమ్మెల్యే రాజయ్యపై తన న్యాయ పోరాటం కొనసాగుతుంది అని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Brs Mla Durgam Chinnaiah: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా..: దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్
ఎమ్మెల్యే రాజయ్య ఇచ్చిన సీడీఎఫ్ నిధులు 25 లక్షల రూపాయలు గ్రామం అభివృద్ధి కోసం ఖర్చు పెడతానని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వద్ద నా భర్త ప్రవీణ్ తీసుకున్న రూ. 7 లక్షలు కూడా త్వరలోనే తిరిగి ఇచ్చేస్తామని నవ్య పేర్కొన్నారు. తాము ఏనాడూ డబ్బుల కోసం ఆశ పడలేదని ఆత్మగౌరవం కోసమే పోరాడామని అన్నారు. డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు కనుకే మేము మా ఆస్తులను అమ్ముకుని మరీ ప్రజా జీవితంలో కొనసాగుతున్నామని అన్నారు. ఎవరి దగ్గర రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండానే ఎమ్మెల్యే రాజయ్య వద్ద తన భర్త తీసుకున్న రూ. 7 లక్షలు తిరిగి ఎమ్మెల్యేకు బాధ్యత కూడా తన భర్తే తీసుకుంటారని.. అందుకోసం తమ కుటుంబానికి చెందిన ఆస్తులే అమ్ముకుంటారో లేక అప్పులే చేస్తారో అది ఆయన వ్యక్తిగతం అని జానకీపురం సర్పంచ్ నవ్య స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Station Ghanpur MLA Rajaiah: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
MLA Rajaiah Vs Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య vs నవ్య పోరాటంలో మరో కీలక పరిణామం