Ertiga Or Creta Which Is Better: దేశంలో మారుతి సుజుకి అంటే అందరికీ ఓ నమ్మకం. చిన్న కార్ల నుంచి హ్యాచ్‌బ్యాక్ సెడాన్ కార్ల వరకూ, మిడ్ ఎస్‌యూవీ నుంచి ఎస్‌యూవీ, 7 సీటర్ వరకూ అన్ని మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 7 సీటర్ అనగానే మారుతి ఎర్టిగా గుర్తొస్తుంటుంది అందరికీ. అంతగా ప్రజల్లో పాతుకుపోయింది ఈ బ్రాండ్.
మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా 7 సీటర్ల కార్లలో అత్యధికంగా విక్రయమౌతోంది. కారణం ధర అందుబాటులో ఉండటమే కాకుండా మెయింటెనెన్స్ చాలా తక్కువ. మారుతి ఎర్టిగా ప్రతి నెలా 10 నుంచి 12 వేల యూనిట్లు విక్రయమౌతోంది. ఇందులో సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 7 సీటర్ల కార్లలో మారుతి ఎర్టిగాకు మంచి క్రేజ్ ఉంది. డిమాండ్ ఉంది. అయితే మారుతి ఎర్టిగా నచ్చనివారికోసం మార్కెట్‌లో మరో కారు అందుబాటులో ఉంది. ఆ కారు ఫీచర్లు, ధర తెలుసుకుంటే ఎర్టిగా వద్దనుకుంటారు.
కియా మోటార్స్ అందిస్తున్న కియా క్యారెన్స్. కియా క్యారెన్స్ ప్రతిసారీ మారుతి ఎర్టిగాతో పోటీ పడుతోంది. కియా క్యారెన్స్ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే రెండూ ఉన్నాయి. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ప్యాన్ సన్‌రూఫ్, డ్రైవర్ సీట్ ఎడ్జస్టెబుల్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, 64 ఏంబీయంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ డబుల్ ఫోల్డింగ్ సీట్లు, డెడికేటెడ్ ఏసీ వెంట్స్, ఎయిర్ ప్యూరిఫయర్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.
Also Read: Higher Pension Updates: ఈపీఎఫ్ఓ శుభవార్త, హైయర్ పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఇక మారుతి సుజుకి ఎర్టిగా ధర 8.64 లక్షల నుంచి ప్రారంభమై 13.08 లక్షల వరకూ ఉంటుంది. అదే కియా క్యారెన్స్ ధర 10.45 లక్షల నుంచి ప్రారంభమై 18.90 లక్షల వరకూ ఉంటుంది. అంటే ఎర్టిగాతో పోలిస్తే కియా క్యారెన్స్ ధర ఎక్కువే. కానీ ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. కియా కార్లు మారుతి సుజుకితో పోలిస్తే అడ్వాన్స్డ్ వెర్షన్‌లో ఉంటాయి. ఇక కియా క్యారెన్స్ మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. మొదటిది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 పీఎస్ పవర్, 253 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది. రెండవది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 పీఎస్, 242 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక మూడవది 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజన్ 116 పీఎస్ , 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. కియా క్యారెన్స్ కారులో 6 ఐఎంటీ, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కారు 6 సీటర్, 7 సీటర్ రెండింట్లో లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook