/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Southern Monsoon Effect: నైరుతి రుతుపవనాలు రాకకై ఈసారి యావత్ ప్రజానీకం ఎదురుచూస్తోంది. జూన్ 12నే రాష్ట్రంలో ప్రవేశించినా ఆ తరువాత ముందుకు కదలని నైరుతి పవనాలు ఎట్టకేలకు పురోగమించాయి. ఇక రేపట్నించి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏయే జిల్లాల్లో ఎప్పట్నించి వర్షాలు పడనున్నాయో వివరించింది. 

భారీ ఎండలు, వడగాల్పులు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన తాడా అప్‌డేట్ ఊపిరిపీల్చుకునేలా చేస్తోంది. రాష్ట్రంలో ఇక నుంచి ఎండల తీవ్రత క్రమంగా తగ్గవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకే ఆలస్యంగా ప్రవేశించాయి. ప్రతి యేటా జూన్ 1 నాటికి కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా జూన్ 8వ తేదీన తాకాయి. ఆ తరువాత కేరళ రాష్ట్రంలో విస్తరించేందుకు సమయం పట్టింది. ఇక అక్కడ్నించి జూన్ 12 వ తేదీన రాష్ట్రాన్ని తాకినా ఎందుకో ముందుకు కదల్లేదు. ఫలితంగా వర్షాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ ఎండలు, తీవ్రమైన వడగాల్పులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ప్రతి యేటా జూన్ 1-4 మధ్యలో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన వెంటనే వర్షాలు ప్రారంభమౌతాయి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్ 12 ఆలస్యంగా రాష్ట్రంలో ప్రవేశించాక కూడా వర్షాల జాడ లేకుండా పోయింది. కారణం రుతుపవనాలు విస్తరించకపోవడమే. ఇప్పుడు రుతుపవనాలు పురోగమిస్తుండటంతో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. రాయలసీమ, దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఫలితంగా ఇవాళ అంటే జూన్ 19వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. అటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.

Also Read: Chia Seeds For Weight Loss: కాఫీలో చియా విత్తనాలు కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గడం ఖాయం!

జూన్ 20, 21 తేదీల్లో రుతుపవనాల ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక కాకినాడ, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

Also Read: New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ, పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Southwest monsoon spreading updates imd warns of rains alert to rayalaseema and south coastal districts
News Source: 
Home Title: 

Monsoon Effect: నైరుతి రుతుపవనాల పురోగమమనం, ఏపీలోని ఆ జిల్లాలకు వర్ష సూచన

Monsoon Effect: నైరుతి రుతుపవనాల పురోగమమనం, ఏపీలోని ఆ జిల్లాలకు వర్ష సూచన
Caption: 
Southwest monsoon (File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Monsoon Effect: నైరుతి రుతుపవనాల పురోగమమనం, ఏపీలోని ఆ జిల్లాలకు వర్ష సూచన
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, June 19, 2023 - 20:46
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
47
Is Breaking News: 
No
Word Count: 
272