NEET UG 2023 Result: నీట్ యూజీ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్, MBBS ఆశావహుల నెక్ట్స్ స్టెప్ ఏంటి ?

NEET UG 2023 Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్  అండర్ గ్రాడ్యూయేట్ 2023 ఫలితాలను ప్రకటించింది. NEET UG 2023 ఫలితాలను ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు వారి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది.

Written by - Pavan | Last Updated : Jun 13, 2023, 10:37 PM IST
NEET UG 2023 Result: నీట్ యూజీ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్, MBBS ఆశావహుల నెక్ట్స్ స్టెప్ ఏంటి ?

NEET UG 2023 Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్  అండర్ గ్రాడ్యూయేట్ 2023 ఫలితాలను ప్రకటించింది. NEET UG 2023 ఫలితాలను ఆ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు వారి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ఎన్టీఏ నిర్వహించిన వైద్య విద్యలో ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి neet.nta.nic.in లోకి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. నీట్ అండర్ గ్రాడ్యూయేట్ 2023 పరీక్షకి 20 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

నీట్ యూజీ 2023 ఫలితాలు తెలుసుకోవడం ఎలా అంటే.. 
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యూయేట్ 2023 ఫలితాలను చెక్ చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు .. వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం భవిష్యత్ అవసరాల కోసం ఫలితాల ప్రింటెడ్ హార్డ్ కాపీని పదిలంగా భద్రపర్చుకోవడం ఉత్తమం.

నీట్ యూజీ 2023 ఫలితాలు  డౌన్‌లోడ్ చేయడం ఎలా
ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.
హోమ్ పేజీలో లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్ కింద ఉన్న NEET 2023 ఫలితంని క్లిక్ చేయండి.
అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి
నీట్ యూజీ 2023 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
నీట్ యూట్ 2023 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్
నీట్ యూజీ 2023 ఫలితాలు వెల్లడి అనంతరం ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందాలి అనుకునే అభ్యర్థులు కౌన్సెలింగ్ లో పాల్గొని తమ ర్యాంక్ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే.

Trending News