మాజీ ప్రధాని వాజ్పేయి మృతికి నివాళిగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, గోవా, అస్సామ్, ఒడిశాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు శుక్రవారం సెలవు దినాన్ని ప్రకటించాయి.
As a mark of respect to former PM Sri Atal Bihari Vajpayee, State government declared holiday for tomorrow. #AtalBihariVajpayee
— Telangana CMO (@TelanganaCMO) August 16, 2018
వాజ్పేయి మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపారు. సంతాప దినాలను పాటించాలని సూచించారు. ఢిల్లీలోని స్మృతి స్థల్లో వాజ్పేయి పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం సగం రోజు సెలవును ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి హాఫ్ డే హాలిడేగా ప్రకటించింది.
అటు వాజ్పేయి మృతికి నివాళిగా నేటి నుంచి ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది.