Ind vs Aus Day 1 Highlights: ఇది నా స్టైల్.. వెరైటీగా డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rohit Sharma DRS Viral Video: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. ఒక్కోసారి అంతే ఫన్నీగా ఉంటాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజు వెరైటీగా డీఆర్ఎస్ కోరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియోను మీరూ చూసేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 8, 2023, 07:23 AM IST
Ind vs Aus Day 1 Highlights: ఇది నా స్టైల్.. వెరైటీగా డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

 Rohit Sharma DRS Viral Video: డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146 నాటౌట్,  22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్‌ స్మిత్‌ (227 బంతుల్లో 95 నాటౌట్, 14 ఫోర్లు) క్రీజ్‌లో పాతుకుపోవడంతో కంగారూ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆకాశం మేఘావృతమై ఉండడం.. పిచ్‌పై పచ్చిక ఉండడంతో భారత్‌కు కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ కాసేపటికే పరిస్థితులు మారిపోవడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్ల భారత బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డీఆర్ఎస్ ఎంచుకున్న తీరు నెట్టింట వైరల్ అవుతోంది. ఉస్మాన్ ఖవాజా డకౌట్ అవ్వగా.. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన లాబుషేన్ కూడా ఇబ్బందిపడ్డాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన ఓ బంతి లాబుషేన్ ప్యాడ్స్‌కు తాకింది. దీంతో ఎల్‌బీడబ్ల్యూ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. 

వికెట్ కీపర్ కేఎస్ భరత్, శార్దుల్ ఠాకూర్‌తో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వెరైటీగా డీఆర్ఎస్ కోరాడు. అంపైర్ వైపు చూడకుండా తన రెండు చేతులను వెనుకకు కదుపుతూ.. డీఆర్ఎస్ కావాలని సైగ చేశాడు. ఇప్పుడు రోహిత్ స్టైల్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ పంచుకోగా.. క్రికెట్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

తొలి రోజు ఆటతీరు చూస్తే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలవాలనే ఆశలపై కంగారూ జట్టు నీళ్లు చల్లేలా ఉంది. ఆరంభంలో ఎంత ప్రభావంతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు ఆ తరువాత తేలిపోయారు. 76 పరుగులకే మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్‌లో పట్టు సాధిస్తారని అనుకున్నారు. అయితే ఆ తరువాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయారు. ట్రావిస్‌ హెడ్‌ వన్డే తరహాలో బ్యాటింగ్ చేయగా.. వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ చక్కటి సహకారం అందించాడు. రెండో రోజు సాధ్యమైనంత త్వరగా ఆసీస్‌ను ఆలౌట్ చేయకపోతే.. మ్యాచ్‌పై టీమిండియా ఆశలు వదులుకోవాల్సిందే. షమీ, సిరాజ్ కంగారూ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టగా.. శార్దుల్,  ఉమేశ్ యాదవ్ పూర్తిగా తేలిపోయారు.

Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!

 Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో గిఫ్ట్.. డీఏ పెంపు ఎంతంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News