Contract Employees Regularization in AP: ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రెగ్యూలరైజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 జూన్ 2 వరకు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం మంత్రుల ఉప సంఘంతో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్‌కు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త పీఆర్‌సీ కమిటీ నియామకం ఉంటుందని చెప్పారు. పీఆర్‌సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయని ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. 3 నెలలకు ఒక విడత చొప్పున.. ఏడాదికి 4 విడతలు.. నాలుగేళ్లలో 16 విడతల్లో బకాయిలను ఉద్యోగులకు చెల్లిస్తామని వెల్లడించారు.
"మొదటి ఏడాది 10 శాతం, రెండో ఏడాది 20 శాతం, మూడో ఏడాది ముప్పై శాతం, నాలుగో ఏడాది నాలభై శాతం చొప్పున చెల్లిస్తాం.. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెంచుకుంటూ.. నాలుగేళ్లలో మొత్తం బకాయిలను ఇస్తాం.. ఇందుకు ఉద్యోగ సంఘాలు ఒకే చెప్పాయి. ఉద్యోగులకు CPS కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తాం.. మా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం.. ఉద్యోగులంతా మా సోదరులే.. మా కుటుంబాల్లోనూ ఉద్యోగులు ఉన్నారు. ఆర్థిక కారణాల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే క్రమబద్ధీకరిస్తున్నాం.. ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాటకు సీఎం కట్టుబడి ఉన్నారు.." అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also Read: AP govt Employees: ఉద్యోగుల డిమాండ్లలో ప్రభుత్వం అంగీకరించినవి ఏంటంటే..
వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల గురించి కూడా మంత్రి మాట్లాడారు. ఇకపై వారికి 010 పద్దు ప్రకారం శాలరీలు జమ చేస్తామని వెల్లడించారు. త్వరలోనే కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామన్నారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని అంశాలను కేబినెట్ మీటింగ్‌లో చర్చించి.. శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Also Read: T20 World Cup 2024: ఐసీసీ షాకింగ్ నిర్ణయం..! టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook