Jeera Water for weight loss Tips: మనిషి శరీరంలో అంర్గతంగా జరిగే లేదా తలెత్తే వివిధ సమస్యలు బాహ్యంగా వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అధిక బరువు కూడా అంతర్గతంగా జరిగే మార్పులతోనే తలెత్తే సమస్య. స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన కారణంగా జీవక్రియను చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టేయవచ్చంటున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధిక బరువు లేదా స్థూలకాయం కేసులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బిజీ లైఫ్ కారణంగా తగిన నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం ఇలా ఈ కారణాలన్నీ స్థూలకాయానికి దారితీస్తున్నాయి. చాలామంది స్థూలకాయం సమస్య నుంచి గట్టెక్కేందుకు వ్యాయమం చేయడం, గంటల కొద్దీ జిమ్‌లో గడపడం, డైటింగ్ చేయడం చేస్తుంటారు. అయినా ఆశించిన ఫలితాలుండవు. అయితే ఈ సమస్యకు చాలా సులభంగా ప్రతి వంటింట్లో లభించే పదార్ధాలతో చెక్ పెట్టవచ్చంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా లభించేది జీలకర్ర, ధనియాలు, కరివేపాకు. సాధారణంగా తినే ఆహార పదార్ధాల రుచి పెంచేందుకు ఇవి ఉపయోగిస్తుంటారు. జీలకర్ర ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరమైంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఫైబర్, పొటాషియం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తాయి. జీలకర్ర తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఇక అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వే వైద్య నిపుణులు. జీలకర్రతో బరువు ఎలా తగ్గించుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Summer Health Problems: ఎండాకాలంలో ఎండవేడితో వచ్చే జబ్బులు
జీలకర్ర నిమ్మకాయ నీళ్లు
ప్రతిరోజూ రాత్రి రెండు స్పూన్ల జీలకర్రను గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడపోసి..కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు ఈ చిట్కా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
జీలకర్ర-కరివేపాకు నీళ్లు
అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు మరో చిట్కా ఇది. జీలకర్ర, కరివేపాకు నీళ్లతో స్థూలకాయం సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీనికోసం రాత్రి నిద్రపోయేముందు ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. ఉదయం ఈ నీటిని కాచి తాగాలి. ఈ మిశ్రమాన్ని రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మెటబోలిజం ఎప్పుడైతే మెరుగుపడిందో బరువు నియంత్రణలో వచ్చేస్తుంది.
జీలకర్ర-ధనియా నీళ్లు
జీలకర్ర, ధనియాల నీరు కూడా బరువు తగ్గించుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధనియా-జీలకర్ర నీళ్లను తాగాల్సి ఉంటుంది. రాత్రి కొద్దిగా జీలకర్ర, ధనియాలను నీళ్లలో వేసి ఉంచాలి. ఉదయం ఆ నీళ్లను పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఇలా జీలకర్రను ధనియాలు, కరివేపాకు, నిమ్మకాయతో కలిపి మూడు విధాలుగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఆధునిక కాలంలో వేధిస్తున్న స్థూలకాయం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Also Read: Metabolism: మెటబోలిజం అంటే ఏమిటి, ఆరోగ్యానికి దీనికీ సంబంధమేంటి, ఎలా మెరుగుపర్చుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి