Sun transit 2023: జూన్ 14 వరకూ ఈ 4 రాశులకు మహర్దశే, వద్దంటే వచ్చి పడే డబ్బు

Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల ఆ ప్రభావం ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఉండనుంది. సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2023, 07:17 AM IST
Sun transit 2023: జూన్ 14 వరకూ ఈ 4 రాశులకు మహర్దశే, వద్దంటే వచ్చి పడే డబ్బు

Sun transit 2023: ప్రతి గ్రహం రాశి పరివర్తనం చెందినట్టే గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై పడినా ముఖ్యంగా 4 రాశులకు అద్భుత ప్రయోజనాలు చేకూర్చనుంది. ఆ నాలుగు రాశులపై వద్దనేకొద్దీ కనకవర్షం కురవనుంది..

హిందూ పంచాంగంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జీవితంలో ఎదురయ్యే వివిధ దశలకు గ్రహాలే కారకులుగా భావిస్తారు. గ్రహాల స్థితి, కదలికను బట్టి రాశుల జాతకం మారిపోతుందంటారు. అదే విధంగా సామర్ధ్యం, గౌరవ మర్యాదలు, ఉన్నత పదవులకు కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. సూర్యుడంటే సింహ రాశికి అధిపతి. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటల 32 నిమిషాలకు సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించాడు. జూన్ 14 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. సూర్యుడి గోచారం అత్యంత శుభప్రదం కానుంది. ముఖ్యంగా 4 రాశులపై అద్భుత వరాలు కురిపించనుంది. 

సూర్యుడి వృషభ రాశి ప్రవేశం ప్రభావం ధనస్సు రాశి జాతకంపై అత్యద్భుతంగా ఉంటుంది. జూన్ 14 వరకూ అంటే దాదాపు నెలరోజులు ఈ రాశివారి జాతకానికి తిరుగుండదు. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి చేతికి అందుతాయి. ఇచ్చిన పాత అప్పులు తిరిగి వచ్చేస్తాయి. ఉద్యోగులకు కీలకమైన పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రత్య్రర్ధులు సైతం మీ ముందు మోకరిల్లాల్సిందే. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండటం అవసరం. 

కర్కాటక రాశి జాతకులకు సూర్యుడి వృషభ రాశి ప్రవేశం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు నిర్దేశిత లక్ష్యాన్ని అందుకోగలరు. మీ కోర్కెలన్నీ నెరవేరిపోతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు లాభాల్ని అందిస్తాయి. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో ఇంటా బయటా అందరి సహకారం లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో ఆర్ధికంగా బాగుంటుంది. అటు ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు తలెత్తవు. ఈ పరిస్థితి ఈ రాశి జాతకులకు ఓ నెలరోజులు ఉంటుంది. 

గ్రహాల రాశి పరివర్తనం చెందినట్టే సూర్యుడి వృషభ రాశిలో ప్రవేశించి ఉన్నాడు. జూన్ 14 వరకూ ఇదే రాశిలో ఉండటం వల్ల మీనరాశి జాతకంపై అద్బుతమైన ప్రభావం పడనుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా నెలరోజులపాటు ఈ రాశి జాతకంపై కనకవర్షం కురుస్తుంది. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. కెరీర్‌పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం దక్కించుకుంటారు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. విద్యారంగంలో వ్యక్తులకు విజయం లభిస్తుంది. 

Also read: Sun transit 2023: సూర్య సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News