Sunrisers Hyderabad opt to bowl: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మార్కో జాన్సెన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ మాత్రం రెండు మార్పులు చేసింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఇప్పటివరకు మెగా టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారిక బెర్త్ దక్కించుకుంటుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింట్లో గెలిచి పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఉంటాయి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, అకేల్ హోసేన్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి.
గుజరాత్ టైటాన్స్ సబ్స్: యష్ దయాల్, శ్రీకర్ భారత్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివం మావి.
Also Read: సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!
Also Read: MG Comet EV Bookings: ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ మొదలు.. మొదటి 5000 మందికి బంపర్ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.