Grah Gochar May 2023: గ్రహ సంచారాల పరంగా మే నెల చాలా ముఖ్యమైనది. మే 15న గ్రహాల రాజు సూర్యభగవానుడు వృషభరాశిలోకి, అదే రోజున బుధుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల చివరిలో శుక్రాచార్యుడు కూడా తన రాశిని చేంజ్ చేయనున్నాడు. మరో రెండు రోజుల్లో మే నెల పక్షం మెుదలుకానుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి
ఈరాశికి అధిపతి సూర్యభగవానుడు. అందుకే ఆదిత్యుడి సంచారం ఈరాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వనుంది. ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు.
కన్య రాశి
బుధ గ్రహ సంచారం వల్ల మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు పని లేదా వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
Also Read: Shani jayanti 2023: శని జయంతి ఈ 5 రాశుల వారికి స్పెషల్.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
కర్కాటక రాశి
గ్రహాల గోచారం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.
మీనరాశి
గ్రహాల గోచారం వల్ల మీనరాశి వారు లాభపడతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీ ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీరు మంచి పొజిషన్ కు వెళతారు.
Also Read: Surya Gochar 2023: ఏడాది తర్వాత వృషభరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook