Junior Panchayat Secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. రేపటిలోగా ఉద్యోగులు తమ డ్యూటీలో చేరకపోతే.. చేరని వారిని తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీసులు పంపించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం.. సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని అన్నారు.
'ప్రభుత్వంతో జేపీఎస్‌లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి.. తమ సర్వీసు డిమాండ్‌తో ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్లలో చేరమని సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే.. సమ్మెకు దిగే హక్కు లేదు. ఈ వాస్తవాలు తెలిసినప్పటికీ.. జేపీఎస్‌లు ఒక యూనియన్‌గా ఏర్పడ్డారు. చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28 నుంచి సమ్మెకు వెళ్లారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జేపీఎస్‌లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు
అయితే ప్రభుత్వం మానవతా దృక్పథంతో జేపీఎస్‌లకు చివరి అవకాశాన్ని ఇస్తోంది. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారు..' అని సందీప్ కుమార్ సుల్తానియా నోటీసుల్లో హెచ్చరించారు. తమను రెగ్యులలైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్ సర్కారు ఇంతవరకు పట్టించుకోవడం లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. అయితే సమ్మె కరెక్ట్ కాదని.. జేపీఎస్ సమ్మె విరమించాలని మంత్రి వారిని కోరారు.
Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి