Blood Purifying Foods: ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలంటే రక్తం కీలక పాత్ర వహిస్తుంది. రక్తం శుభ్రంగా ఉన్నంతవరకూ ఏ విధమై అనారోగ్యం దరిచేరదు. అంటే ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి అవసరం. రక్తాన్ని శుభ్రపర్చేందుకు కొన్ని సులభమైన, సహజసిద్ధమైన పద్ధతులున్నాయి.
శరీరంలోని ప్రతి ప్రక్రియలో కీలకమైంది రక్తం మాత్రమే. రక్తం ద్వారానే మనిషి జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. అందుకే రక్తం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాల్సి ఉంటుంది. రక్తం పరిశుభ్రంగా ఉన్నంతవరకూ ఎన్నో రకాల వ్యాధులు దరి చేరవు. ఎప్పటికప్పుడు రక్తం క్లీన్ అవుతూ ఉంటే..శరీరంలోని విష పదార్ధాలను బయటకు పోతుంటాయి. సహజసిద్ధమైన బ్లడ్ ప్యూరిఫయర్ ఫుడ్స్ చాలా అవసరం. ఇవి కేవలం శరీరంలోని ప్రతి అంగం వరకూ ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. అంతేకాకుండా కాలుష్యపూరితమైన వ్యర్ధాలల్ని తొలగిస్తుంది. అందుకే శరీరం సాధారణ జీవక్రియను మెరుగుపర్చేందుకు రక్తం శుభ్రంగా ఉండాలి. రక్తం పరిశుభ్రంగా ఉంటే కిడ్నీ, హార్ట్, లివర్, లంగ్స్, లింఫోటిక్ వ్యవస్థ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. దీనికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు అవలంభించాలేది తెలుసుకుందాం..
నేచురల్ బ్లడ్ ప్యూరిఫయర్ ఫుడ్స్
ఆకు పచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు ఆరోగ్యానికి ఎప్పటికీ మంచివే. ఇందులో ఉండే పోషకాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రోగాల్నించి ఉపశమనం కల్గిస్తాయి. దీనికోసం అరటి కాయ, పాలకూర, బీరకాయ, బెండకాయ వంటి కూరలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి
నిమ్మకాయ
నిమ్మకాయను అనాదిగా ఓ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రోజు గ్లాసు నీళ్లలో నిమ్మ రసం కలుపుకుని తాగితే శరీరంలోని విష పదార్ధాలు తొలగిపోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి, మినరల్స్ సంపూర్ణంగా ఉంటాయి. దాంతో రక్తం పరిశుభ్రంగా ఉంటుంది.
అవకాడో
అవకాడో అద్భుతమైన నేచురల్ బ్లడ్ ప్యూరిఫయర్. శరీరంలోని విష పదార్దాలను బయటకు తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. విష పదార్దాలు బయటకు వెళ్లకపోతే బ్లడ్ వెసెల్స్‌కు హాని కలుగుతుంది. అవకాడోలో విటమిన్ ఇ సంపూర్ణంగా ఉంటుంది. ఇది చర్మాన్ని డెడ్ స్కిన్ నుంచి కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కల్గించే దుష్ప్రభావాల్నించి కాపాడుతుంది. అవకాడోలో పుష్కలంగా ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా అవసరం.
బ్రోకలీ
బ్రోకలీ అన్నింటికంటే ఉత్తమమైన నేచురల్ బ్లడ్ ప్యూరిఫయర్. శరీరంలోని విష పదార్దాలను బయటకు తొలగిస్తుంది. ఇందులో కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డీటాక్సిఫై చేసి..ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ తీసుకునే డైట్‌లో బ్రోకలీ తప్పకుండా ఉండాలి.
Also read: Cholesterol Problem: మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉందా, తక్షణం ఈ పదార్దాలు మానేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook