Pushpa 2 Financial Issues Cleared: పుష్ప ముందు వరకు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టు మారిపోయింది అల్లు అర్జున్ క్రేజ్ పరిస్థితి. పుష్ప సినిమా ప్రకటించక ముందు వరకు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ పేరుతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యాడు కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా సూపర్ హిట్ అయిందో అప్పటి నుంచి ఆయన ఐకాన్ స్టార్ గా మారే ప్రయత్నం చేస్తూ పుష్ప సినిమా సక్సెస్ తో కొంతవరకు సఫలం అయ్యాడు కూడా. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్గా నిలిచింది. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో రాసుకున్న కథతో అద్భుతాలు సృష్టించాడు సుకుమార్.
ఒక ఎర్రచందనం దుంగలు కొట్టే కూలీగా కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తి ఒక సిండికేట్ మొత్తాన్ని నడిపి స్థాయికి ఎలా వెళ్లాడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించారు. మొదటి సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తర్వాత కొన్ని ఇతర సినిమాలు నార్త్ లో సూపర్ హిట్ లు గా నిలిచిన నేపథ్యంలో ఈ రెండో భాగం మీద చాలా శ్రద్ధ పెట్టారు. ఇక కొద్ది రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ జరిగిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఐటీ రైడ్స్ ముగిశాయి. అయితే ఇంకా సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగానే షూటింగ్ నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: Chandrababu Calls Rajinikanth: రజనీకాంత్ కి బాబు ఫోన్.. అభయమిచ్చిన తలైవా!
ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్ కు సంబంధించిన నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమా నిర్మిస్తోంది. ఇప్పుడు ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో నిర్మాణ సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ తొలగి పోయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో భాగం అనుకున్నప్పుడు భారీ స్థాయిలో నిర్మించాలని అనుకోలేదు కానీ ఇప్పుడు తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా స్కేల్ పెంచేశారు.
ఈ నేపథ్యంలో పుష్ప 2 ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. కేవలం నటీనటులు సాంకేతిక వర్గాలకు ఇచ్చే రెమ్యూనరేషన్లు మాత్రమే 200 కోట్ల రూపాయలకు పైగా అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న దానికంటే అదనంగా మరో వంద కోట్లు కావాల్సి వచ్చిందని అంటున్నారు. ఐటీ అధికారుల హడావుడి, ఆ రైడ్స్ కనుక లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎలాగోలా సినిమాని కంప్లీట్ చేసి ఉండేది. కానీ ఆ డబ్బు కోసమే ఇప్పుడు వేరే దారులు వెతుక్కుంటూ చివరికి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇక అర్ధాంతరంగా ఆగిపోయిన షెడ్యూల్ని ఈ నెల రెండవ వారం లేదా మూడో వారంలో ప్రారంభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఐదు రోజులపాటు రైడ్స్ జరిగాయి అన్న పేరే కానీ అటు నిర్మాణ సంస్థ నుంచి కానీ ఐటీ అధికారుల నుంచి కానీ ఈ రైడ్స్ కి సంబంధించి ఎలాంటి సమాచారం షేర్ చేయబడలేదు. ఈ నిర్మాణ సంస్థకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఈ అంశం మొత్తం సద్దుమణిగిపోయింది.
Also Read: Puvvada Ajay Met Jr NTR: ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ మంత్రి.. ఆరోజు షాక్ ఇస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook