Platforms At 2 KM Distance At Barauni Junction: మనం రైళ్ల గురించి పెద్దగా తెలుసుకోంగానీ.. తెలుసుకుంటే మాత్రం అనేక వింత విషయాలు తెలుస్తాయి. మన రైళ్లు, రైల్వే స్టేషన్లు ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉన్నాయి. ఒక్కో విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి విషయమే ఇది కూడా. మీరు సాధారణంగా రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ఫ్లాట్‌ఫారమ్‌కు వెళ్లాలంటే.. మెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్ ఉపయోగించి మారతారు. మరికొందరు పట్టాలు దూకి మారుతారు అదే వేరే విషయం. కానీ.. ఓ స్టేషన్‌లో మాత్రం ప్లాట్‌ఫారమ్ మారాలంటే కనీసం రెండు కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఈ స్పెషల్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది..? ఎందుకు రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య అంత దూరం..? వివరాలు తెలుసుకుందాం..
ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని బరౌని జంక్షన్ గ్రామం అనే పట్టణంలో నిర్మించారు. ఇది గంగా నది ఒడ్డున ఉన్న ఒక పారిశ్రామిక పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక చమురు శుద్ధి కర్మాగారాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ పట్టణం పేరు మీదుగా ఈ స్పెషల్ రైల్వే స్టేషన్‌కి బరౌని జంక్షన్ అని పేరు పెట్టారు. ఈ జంక్షన్‌ను 1883లో బ్రిటిష్ వారు పాలించినప్పుడు నిర్మించారు. అప్పట్లో జనాభా తక్కువగా ఉండడంతో ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నంబర్ ఒకటి మాత్రమే నిర్మించారు.
బరౌని జంక్షన్ ప్రారంభమైనప్పుడు.. మొదట్లో ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీల నుంచి వివిధ జిల్లాలు చమురు సరఫరా చేసే గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగేవి. కొంతకాలం తరువాత ప్యాజింజర్ రైళ్లను కూడా నడపాలని బ్రిటిష్ అధికారులను ప్రజలు కోరారు. అయితే ఆ ప్లాట్‌ఫారమ్‌పై గూడ్స్ రైళ్లు భారీగా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో 2 కి.మీ దూరంలో మరో రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని అప్పటి అధికారులు నిర్ణయించారు. కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించి.. బరౌని రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. అలా ఒకే పేరుతో రెండు స్టేషన్లు ఏర్పడ్డాయి.
ఈ స్టేషన్‌లో కూడా ఒకే ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒకే రైల్వే స్టేషన్‌లో 2 కి.మీ మేర 2 ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి. కొద్దిరోజులు రెండు స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ నంబరు ఉండగా.. తరువాత పాత స్టేషన్‌లో రెండో నంబరుగా మార్చారు. కొత్త స్టేషన్‌లో ఒకటో నెంబర్‌ను కొనసాగించారు. స్వాతంత్ర్యం అనంతరం కొత్తగా నిర్మించిన బరౌని రైల్వే స్టేషన్‌కు న్యూ బరౌని జంక్షన్ అని పేరు పెట్టారు. అయితే రెండు స్టేషన్ల ఫ్లాట్‌ఫారమ్ మధ్య దూరం మాత్రం ఎప్పటికీ తగ్గించలేనిది. ఆ ప్లాట్‌ఫారమ్ నుంచి ఈ ఫ్లాట్‌ఫారమ్‌కు రావాలంటే 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే.
Also Read: Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్
Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్.. సిట్ విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి