CM KCR: కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే గిఫ్ట్.. జీతాలు పెంచుతూ నిర్ణయం

Sanitation Workers Salary Hike: కార్మికుల దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాన్ని రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన జీతాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. 

Written by - Ashok Krindinti | Last Updated : May 1, 2023, 06:34 PM IST
CM KCR: కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే గిఫ్ట్.. జీతాలు పెంచుతూ నిర్ణయం

Sanitation Workers Salary Hike: పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ మేడే సందర్భంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెలకు తలా రూ.1000 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన రూ.1000  వేతనం అదనంగా  జీతం తో పాటు కలిపి అందుతుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు

‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుధ్ద్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు చెప్పారు.

తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉందన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందన్నారు. తద్వారా పారిశుధ్ద్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతోందన్నారు. మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని అన్నారు. కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని వివరించారు. కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఖర్చు చేసిన వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?  

Also Read: BJP Manifesto Highlights: ఉచితంగా వంట గ్యాస్, పాలు.. ప్రతి వార్డులో నమ్మ క్లినిక్‌లు ఏర్పాటు.. బీజేపీ వరాల జల్లు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News