Indian Idol Season 3: లాంచింగ్ ఎపిసోడ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు మెగా మ్యూజికల్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

Indian Idol Season 3: తెలుగులో మ్యూజిక్ టాలెంట్ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’ గ్రాండ్ ప్రారంభమైంది. అంతేకాదు ఆడియన్స్ ఎంతగానో ఎదరు చూసిన ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 17, 2024, 07:01 PM IST
Indian Idol Season 3: లాంచింగ్ ఎపిసోడ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు మెగా మ్యూజికల్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

Indian Idol Season 3: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రముఖ నేపథ్య గాయకులు కార్తిక్, గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా  వ్యహరించే ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి. హిందీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటేషన్ షోలో దేశ, విదేశాల నుంచి చాలా మంది ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాదు గాయకులు తమ పాటలతో  ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఫస్ట్, సెకండ్ ఆడిషన్ ఎపిసోడ్స్ ఈ షో పై వున్న అంచనాలు మరింతగా పెంచాయి. తొలి ఎపిసోడ్ మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఎవర్ గ్రీన్ మెలోడీ ఈ శతమానం అన్నదిలే పాటతో మ్యూజికల్ షో ప్రారంభమైయింది. ఈ పాటకు గోల్డెన్ మైక్ తో పాటు తమన్ నుంచి స్టంప్ అందుకుంది కంటెస్టెంట్ కీర్తి. తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అద్భుతమైన గానంతో  ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.  

సెకండ్ ఎపిసోడ్ లో తన వైబ్రెంట్ వోకల్స్ తో జడ్జెస్ లను  మైమరపించిన అనిరుద్ సుస్వరం గోల్డెన్ మైక్ ని తో పాటు పెర్ఫార్మర్ అఫ్ ది వీక్ గా నిలిచాడు. అనిరుధ్ సుస్వరన్ ఇప్పటికే చావు కబురు చల్లగా సినిమాలో పాట పాడాడు. తనను తాను నిరూపించుకోవడానికి తెలుగు ఇండియన్ ఐడల్‌కి వచ్చాడు.

శ్రీ ధుతి.. గత సీజన్‌కు వచ్చింది కానీ సెలెక్ట్ కాలేదు. తెలుగు ఇండియన్ ఐడల్ షోలోకి రావాలనేది తన తండ్రి కల. ఇప్పుడా కలని నెరవేర్చడానికి షోలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.  ఆమె పాడిన తలచి తలచి పాట  జడ్జెస్ ను  మెప్పించింది. అద్భుతమైన పాటగాళ్లతో జర్నీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కదిలిచింది. జడ్జ్ గా వున్న కార్తిక్, కంటెస్టెంట్స్ తో వచ్చిన గెస్ట్ లతో కలసి పాడటం మరో హైలెట్ గా నిలిచింది.

గోల్డెన్ మైక్‌లు, గోల్డెన్ టిక్కెట్లు గెలుచుకోవడం అంత ఈజీ కాదని ఆడిషన్స్ చూస్తుంటే అర్ధమౌతోంది. సంగీత పరంగా సాగిన లాంచింగ్ ఎపిసోడ్స్ చూస్తుంటే సీజన్ 3 డబుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ తో ఉండబోతుందని అర్ధమవుతోంది.  మొత్తానికి లాంచింగ్ ఆడిషన్ ఎపిసోడ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 'ఆహా'లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం స్ట్రీమింగ్  అవుతోంది.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News