Yendira Ee Panchayati Tease Out: విలేజ్ డ్రామాతో కూడిన లవ్ స్టోరీలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథలను కొత్తగా.. అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు మంచి విజయాలను సాధిస్తున్నారు. ఈ కోవలోనే విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రం రాబోతోంది. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతుండగా.. ఇది వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, గ్లింప్స్, టైటిల్ లోగోలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
పల్లెటూరు వాతావరణంలో సాగే కథ.. ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు మధ్య జరిగే సంభాషణలు మరియు విభిన్న లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అని గ్లింప్స్ చూస్తూనే అర్థం అవుతుంది. తాజాగా ఈ చిత్రం మరో అప్డేట్.. అంటే టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో థ్రిల్లర్, లవ్, కామెడీ, యాక్షన్, వంటి అన్ని రకాల ఎమోషన్స్ చూపించేసారు మూవీ మేకర్స్. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్ అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’, ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’. అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పెద్దపల్లి రోహిత్ సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా.. , జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించగా.. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: eavy Rains Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
డీఐ : పీవీబీ భూషణ్
Also Read: Janasena-Tdp: ప్యాకేజ్ బంధం ప్రభావమే ఈ పొత్తు, జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook