Mercy Killing Movie Review: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'మెర్సి కిల్లింగ్'. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా.. సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. జి.అమర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. ఎం.ఎల్.రాజా సంగీతం అందించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వేచ్ఛ అనే బాలిక తనకు న్యాయం జరగాలని ఎలాంటి పోరాటం చేసింది..? ఆమెకు ఎవరు సాయం చేశారు..? అనేదే సినిమా. మరి సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందో లేదో రివ్యూలో చూద్దాం..
కథ ఏంటంటే..?
చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల నుంచి వేరుగా అనాథగా బతుకుతుంటుంది స్వేచ్ఛ (హారిక). తన తల్లిదండ్రులు ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే మహేష్ (పార్వతీశం), భారతి (ఐశ్వర్య) కలుస్తుంది. వారిద్దరు ఎవరు..? స్వేచ్ఛకు ఎలాంటి సాయం చేశారు..? రామకృష్ణమ్ రాజు (సాయి కుమార్) స్వేచ్ఛకు ఎలా ఎదురయ్యాడు..? స్వేచ్ఛకు జడ్జి (సూర్య) ఇచ్చిన సలహా ఏంటి..? స్వేచ్ఛ తన తల్లిదండ్రులను కలిసిందా..? ఈ విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌కు పరిచయమైన హారిక.. ఈ మూవీలో స్వేచ్ఛ అమ్మాయి పాత్రలో జీవించేసింది. కొన్ని సీన్స్‌లో ఐశ్వర్య అదిరిపోయే పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. సాయి కుమార్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. బసవరాజు పాత్రలో రామరాజు మెప్పించాడు. జడ్జి పాత్రలో సూర్య తన పాత్ర పరిధి మేరకు నటించారు. స్వేచ్ఛ, రామకృష్ణమ్ రాజు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి. సినిమాకు ఈ దృశ్యాలే హైలెట్‌గా నిలుస్తాయి. తాను రాసుకున్న కథ, సమాజంలో జరిగిన కొన్ని జరిగిన సంఘటనలు ఆధారంగా డైరెక్టర్ వెంకట రమణ ఈ మూవీని తెరకెక్కించారు. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌ను చాలా చక్కగా డీల్ చేశారు.
జి.అమర్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. లొకేషన్స్, పాటలు, కాకినాడలోని ఉప్పడా బీచ్, ఫిషింగ్ హార్బర్ ఇలా అన్ని లొకేషన్స్‌ను చాలా చక్కగా చూపించారు. ఎం.ఎల్.రాజా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. మెర్సి కిల్లింగ్ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించారు. కుటుంబంతో కలిసి వెళ్లి చూడొచ్చు.
Also Read: Glenn Maxwell: ఆర్సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్లో ఇలా..!
Also Read: Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook