Crazy Rambo: ‘క్రేజీ రాంబో’ టైటిల్ తోనే సినిమాపై భారీ అంచనాలు..హీరో అశ్విన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Crazy Combo: పేరులో ఏమున్నది అనుకోకండి.. పేరుతోనే అది ఎలాంటి సినిమా అనే దానిపై ఆడియన్స్ కూడా ఓ అంచనాకు వస్తారు. తాజాగా ‘క్రేజీ కాంబో’ మూవీ టైటల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు హీరో అశ్విన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 29, 2024, 03:45 PM IST
Crazy Rambo: ‘క్రేజీ రాంబో’ టైటిల్ తోనే సినిమాపై భారీ అంచనాలు..హీరో అశ్విన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

Crazy Combo: షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కోతున్న చిత్రం ‘క్రేజీ రాంబో’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ఛీఫ్ గెస్ట్ గా హాజరైయ్యాడు.
కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సినిమా వుండబోతోన్నట్టు సమాచారం. రాంబో టైటిల్ రోల్  లో హీరో షమ్ము నటిస్తున్నాడు . అంతేకాదు ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఈ సినిమా డిఫరెంట్  స్క్రీన్‌ప్లేతో  డైలాగ్‌లతో రాబోతుంది. సంగీతం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నట్టు సమాచారం.

టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ..

‘క్రేజీ రాంబో’  టైటిల్ తోనే సినిమా పై అంచనాలు పెంచేసారు. పేరు కూడా  చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని  మనసారా  కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో షమ్ము మాట్లాడుతూ..

నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. క్రేజీ రాంబో కథ చాలా బావుటుంది. ఔట్ పుట్ ఇంకా అద్భుతంగా  ఉండబోతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.   

నిర్మాత, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ..

డైరెక్టర్ మధు  కథ చెప్పినపుడు నాకు చాలా బాగా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నాను. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఈ సినిమా వుంటుందన్నారు.  

ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు.  జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.  తారాగణం: షమ్ము
బ్యానర్ :  సప్తాశ్వ ప్రొడక్షన్స్.. రచన, దర్శకత్వం:  హరీష్ మధురెడ్డి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News