Nenu-Keerthana: ‘నేను-కీర్తన’మూవీతో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి.. జయభేరి అధినేత మురళీమోహన్ ప్రశంసలు..

Nenu Keerthana: చిమటా రమేష్ బాబు హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. హీరోగా, డైరెక్టర్ గా రెండు పడవలపై ప్రయాణం చేసే వారు చాలా అరుదుగా ఉంటారు.  తాజాగా ఈ సినిమా హీరో కమ్ దర్శకుడిపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ప్రశంసల ఝల్లు కురిపించాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2024, 07:41 PM IST
Nenu-Keerthana: ‘నేను-కీర్తన’మూవీతో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి.. జయభేరి అధినేత మురళీమోహన్ ప్రశంసలు..

Nenu Keerthana: ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా తక్కువ ఉంటారు. అలాంటి వాళ్లతో చిమటా రమేష్ బాబు ఒకరు. ఈయన హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "నేను - కీర్తన" ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో కచ్చితంగా   ప్రేక్షకుల మెప్పు పొందటం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు జయభేరి అధినేత మురళీ మోహన్ ఆకాంక్షించారు. "నేను - కీర్తన" చిత్రం నుంచి "కొంచెం కొంచెం గుడుగుడు గుంజం" అనే ఐటమ్ సాంగ్ ను మురళీమోహన్ విడుదల చేసారు.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ..  చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరో హీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన". త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

సినిమాలు, రియల్ ఎస్టేట్, పాలిటిక్స్ లో  తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభాశాలిగా పేరు గడించిన మాగంటి మురళీమోహన్ తమ చిత్రం నుంచి ఐటమ్ సాంగ్ విడుదల చేసారు. తమ సినిమా ఘన విజయం సాధించాలని  కోరుకోవడం పల్ల ట్ల  చిత్ర దర్శకుడు కమ్ హీరో చిమటా రమేష్ బాబు ధన్యాదాలు తెలిపారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని ఆయన అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News