Astrology by Name: ఈ అక్షరంతో పేరున్న వారు చిన్న వయసులోనే సంపన్నలు అవుతారు!

Astrology by Name: ఒక వ్యక్తి భవిష్యత్తు తెలుసుకునేందుకు సాధారణంగా రాశిచక్రాన్ని పరిశీలిస్తారు. కానీ, పేరులోని మొదటి అక్షరం ద్వారా కూడా ఓ వ్యక్తి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఆ విధంగా కొన్ని ఇంగ్లీష్ అక్షరాలతో ప్రారంభమైన పేర్లు కలిగిన వారు చిన్న వయసులోనే సంపన్నులుగా మారుతారని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 12:00 PM IST
Astrology by Name: ఈ అక్షరంతో పేరున్న వారు చిన్న వయసులోనే సంపన్నలు అవుతారు!

Astrology by Name: జోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశిచక్రం సహాయంతో ఒక వ్యక్తి భవిష్యత్తు అంచనా వేస్తారు. అదే విధంగా పేరులోని మొదటి అక్షరంతోనూ ఓ వ్యక్తి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. పేరు బలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక అక్షరాలతో పేరును కలిగిన వారికి చిన్న వయసులోనే అపార సంపద కలిసి వస్తుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంతకీ చిన్న వయసులోనే సంపన్నులుగా మారే వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

B అక్షరంతో..

'బి' అనే అక్షరంతో పేరుండే వ్యక్తులు అదృష్టవంతులు. అంతేకాదు వారు చాలా కష్టపడి పని చేస్తారు. అదే విధంగా తెలివైన వారు. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధిస్తారు. ఈ అక్షరంతో పేరు ఉండే వారు అటు ఉద్యోగంతో పాటు వ్యాపారంగానూ రాణిస్తారు. 

D అక్షరంతో..

ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేసే తత్వం కలవారు. అదే విధంగా జాతక రీత్యా వీరు అదృష్టవంతులు. వారి చేసే కృషి వల్ల ప్రతి రంగంలోనూ రాణిస్తారు. తమ తమ తెలివి తేటలతో ఈ రాశుల వారు చిన్న వయసులోనే సంపన్నులవుతారు. 

H అక్షరంతో..

H అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు జాతక రీత్యా అదృష్టవంతులు. ఏ రంగంలోనైనా విజయాలను సునాయాసంగా సాధిస్తారు. జీవితంలో ఎలా ఎదగాలో చిన్న వయసులోనే ప్రణాళికలను వేసుకొని.. విజయం సాధిస్తారు. 

L అక్షరంతో..

ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వతహాగా కష్టపడే తత్వం కలవారు. చాలా తెలివైన వారు కూడా. అయితే విజయాల కోసం ఎన్నో సుఖాలను వీరు త్యాగం చేస్తారు. దీంతో చిన్న వయసులోనే సంపన్నులుగా ఎదుగుతారు. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Maha Shivratri 2022: మహాశివరాత్రి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే... మీ ప్రతి కోరిక నెరవేరుతుంది..!

Also Read: Lucky Zodiac Signs: ఈ 3 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వచ్చే 10 రోజుల్లో పట్టిందల్లా బంగారమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News