Worst Eating Habits: జీవిత కాలాన్ని తగ్గించే ఆహార పదార్థాలు.. వీటికి దూరంగా ఉండటమే బెటర్!

మనం పాటించే ఆహార నియామాలు, జీవనశైలి మన జీవిత కాలాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు మన జీవిత కాలాన్ని తగ్గించేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావున ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు దూరంగా ఉండి..  మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 06:40 PM IST
Worst Eating Habits: జీవిత కాలాన్ని తగ్గించే ఆహార పదార్థాలు.. వీటికి దూరంగా ఉండటమే బెటర్!

Worst Eating Habits: మనం పాటించే ఆహార నియామాలే మన జీవిత కాలాన్ని నిర్దేశిస్తాయి. కొన్ని ఆహారాలను తినటం ద్వారా జీవిత కాలం తగ్గుతుంది. జీవిత కాలాన్ని పెంచుకోవాలి అనుకునే వారు వెంటనే కొన్ని ఆహారాలను తింటాం ఆపేయాలి. జీవిత కాలాన్ని తగ్గించే కొన్ని ఆహారాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 

ప్రతి ఒక్కరు సంతోషంతో కూడిన  సుదీర్ఘమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ, జీవిత కాలాన్ని పొడిగించుకోవడం మన చేతుల్లో ఉందా..? అంటే దీనికి అవును అనే చెప్పాలి. మన జీవన శైలి మరియు పాటించే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు.మంచి ఆహారాన్ని తింటే.. మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా జీవిత కాలం తగ్గుతుందన్న విషయం మీకు తెలుసా..?  జీవిత కాలాన్ని తగ్గించే కొన్ని ప్రమాదకరమైన  ఆహార పదార్ధాల గురించి ఇపుడు తెలుసుకుందాం.  

అధ్యయనంలో జరిగిన వాదన 
'మిచిగాన్ యూనివర్సిటీకి' చెందిన నిపుణులు దాదాపు 6 రకాల ఆహార పదార్థాలపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనం 'నేచర్ ఫుడ్ జర్నల్‌లో' ప్రచురించబడింది. కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల మన వయస్సు పెరుగుతుందని మరియు కొన్ని ఆహార పదార్ధాలను ఒక్కసారి తిన్న కూడా వారి వయస్సు కూడా తగ్గుతుందనే విషయాన్ని ఈ అధ్యయనంలో తెలిపారు.టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ప్రాసెస్ చేసిన మాంసం జీవితాన్ని 26 నిమిషాలు తగ్గిస్తుందని ఈ అధ్యయనంలో తెలుపబడింది. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు కూడా పిజ్జాపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో ఒక పిజ్జా తినడం వల్ల జీవితకాలం 7.8 నిమిషాలు తగ్గుతుందని.. శీతల పానీయాలు 12.4 నిమిషాలు.. హాట్ డాగ్‌లు 36 నిమిషాలు మరియు చీజ్ బర్గర్‌లు 8.8 నిమిషాలు తగ్గిస్తాయని కనుగొన్నారు. 

Also Read: RK Singh: తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు.. కుండబద్దలు కొట్టేసిన కేంద్రమంత్రి  

ఈ ఆహారాలను తినడం ద్వారా జీవిత కాలం పెరుగుతుంది  
పరిశోధనా బృందంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఒలివర్ జోలియట్ మాట్లాడుతూ.. 'పరిశోధనలో వెలువడిన ఫలితాలు ప్రజలు తమ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. మానవ ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ప్రజలు తమ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.ఈ అధ్యయనం లో కొన్ని పరిశోధనలు చేయగా,కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా జీవిత కాలం పెరుగుతుంది అని తెలిసింది.ఉదాహరణకు, పీనట్ బటర్ మరియు జామ్ శాండ్‌విచ్ తినడం వల్ల 33.1 నిమిషాల జీవితకాలం పెరుగుతుంది. కాల్చిన సాల్మన్ చేపలను తినడం వల్ల జీవితకాలం 13.5 నిమిషాలు పెరుగుతుంది.మరియు, టమాటలను  తినడం వల్ల 3.8 నిమిషాల జీవితకాలం పెరుగుతుంది మరియు అవకాడో తినడం ద్వారా, 1.5 నిమిషాల జీవితకాలం పెరుగుతుంది.

Also Read: Chandrababu Bail: ఎట్టకేలకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు, విచారణ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News