Coconut Milk for Long Hair : కొబ్బరిపాలతో కురులు సిరులు.. నడుము వరకు మందంగా పెరుగుతుంది..

Long Hair Coconut Milk: కొబ్బరిపాలలో పోషక గుణాలు ఉంటాయి.ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. అంతేకాదు కొబ్బరిపాలు కుదుళ్లకు మాయిశ్చర్‌ను ఇస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 30, 2024, 03:39 PM IST
Coconut Milk for Long Hair : కొబ్బరిపాలతో కురులు సిరులు.. నడుము వరకు మందంగా పెరుగుతుంది..

Coconut Milk For Long Hair: కొబ్బరిపాలలో పోషక గుణాలు ఉంటాయి.ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి. అంతేకాదు కొబ్బరిపాలు కుదుళ్లకు మాయిశ్చర్‌ను ఇస్తాయి.

కొబ్బరి పాలను ఎలా తయారు చేయాలి?
కొబ్బరికాయను తీసుకుని దాన్ని పగులగొట్టి అందులో నుంచి కొబ్బరిని చిప్ప నుంచి వేరు చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండర్ లేదా మిక్సర్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పిప్పిని, పాలను కాటన్ గుడ్డ సహాయంతో వడగట్టుకోవాలి. ఇది కాకుండా సూపర్‌ మార్కెట్లలో క్యాన్ కొకనట్‌ మిల్క్ ఉంటుంది. మంచి నాణ్యత కలిగింది తీసుకోండి. ఈ క్యాన్లో షుగర్ లేకుండా ఉన్నవాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

ఇదీ చదవండి:  ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌లో ఒకేసారి ఇలా 5 ప్రాంతాలను చుట్టేయండి..

హెయిర్ మాస్క్..
కొబ్బరిపాలు-1/2 కప్పు
తేనె -1TBSP
ఆలివ్ ఆయిల్-1 TBSP

ఇదీ చదవండి:  ఎండలో మేకప్ జిడ్డుగా మారిపోతుందా? ఈ 6 టిప్స్ మీకోసం..

తయారీ విధానం..
పైన పేర్కొన వస్తువులన్ని కలుపుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి మసాజ్ చేస్తూ జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. ఓ 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూతో తలస్నానం చేసుకోవాలి. కొబ్బరిపాలు, కలబంద గుజ్జు కలిపి జెల్ మాదిరి తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను కుదుళ్ల నుంచి అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత జుట్టు షాంపూతో కడిగేయాలి.ఈ కొబ్బరి పాలలో మెంతులపొడి వేసుకుని కూడా ప్యాక్ మాదిరి తయారు చేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది. ఓ అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

కొబ్బరిపాలు, ఆర్గాన్ ఆయిల్ కలిపి మంచి కండీషనర్‌గా తయారు చేసుకోవచ్చు. 
నిమ్మకాయ, కొబ్బరిపాలను కూడా కలిపి హెయిర్ కు పట్టించాలి. ఓ 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. అయితే, కొబ్బరి పాలు జుట్టుకు బాగా పట్టాలి అంటే కాస్త గోరువెచ్చగా వేడిచేయాల్సి ఉంటుంది. జుట్టుకు పూర్తిగా కొబ్బరి పాలను పట్టించిన తర్వాత తలకు షవర్ క్యాప్ తొడిగించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News