ఆ సీతాకోక చిలుకలకు కన్నీళ్లే ఆహారం

ఒక్క సీతాకోక చిలుకే కాదు, మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మొసలి, తాబేలే కాదు పశువుల కన్నీళ్లను కూడా తాగుతాయి.

Last Updated : Jan 25, 2018, 09:38 AM IST
ఆ సీతాకోక చిలుకలకు కన్నీళ్లే ఆహారం

సీతాకోక చిలుకలు ఏమి తింటాయి.. అంటే పూవుల్లోని మకరందాన్ని తింటాయి అని ఠక్కున చెప్పేస్తాం.. కానీ అమెజాన్ అడవుల్లో ఉన్న సీతాకోక చిలుకలు మకరందాన్ని తినవట. అవి కన్నీళ్లను ఆహారంగా తాగుతాయట. నమ్మశక్యంగా లేదుకదూ ..! అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవలసిందే ..! 

* ఓసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.. అతను కొన్ని సీతాకోక చిలుకలు మొసలి, తాబేలు కళ్ల నుండి కన్నీళ్లను పీల్చడం గమనించాడట. ఇలా ఎందుకు పీలుస్తున్నాయని సందేహం వచ్చి రోజుల తరబడి పరిశోధన చేశాడట.

* ఎప్పుడూ మకరందాన్ని తాగే వీటికి లవణాలు అవసరం. ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి, జీవిత చక్రాన్ని సాఫీగా ఉంచుకోగలవు.

*ఈ లవణాలు పూల మకరందంలో దొరకవు. కనుక తాబేళ్లు, మొసలి లాంటి జీవుల్లో కన్నీళ్లను తాగేస్తాయి సీతాకోకచిలుకలు. ఒకరంకంగా చెప్పాలంటే రెండింటికీ ఉపయోగమే. ఎలాగంటారా.. ! సముద్రంలో ఉండి.. ఉండి మొసలి, తాబేలు  కళ్ల వద్ద సోడియం అధికంగా పేరుకుపోతుంది. సీతాకోకచిలుకలు పీల్చు కోవడంతో అది కాస్త తగ్గిపోతుంది. సీతాకోక చిలుకకూ లవణాలు దొరుకుతాయి.. ఆ జీవులకూ సోడియం తగ్గుతుంది.

* ఒక్క సీతాకోక చిలుకే కాదు, మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మొసలి, తాబేలే కాదు పశువుల కన్నీళ్లను కూడా తాగుతాయి. మూత్రం, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ వాలిపోతాయట ఈ మకరందం జీవులు.

*  మనకు కనిపించే సీతాకోక చిలుకల్లో ఈ ప్రవర్తనను ఎప్పుడూ గమనించలేదు కదూ. ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అవి కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాయేమో ?!

Trending News