Gorintaku Black Tea Can Turn White Hair Black In 7 Days: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో కాలుష్యం కారణంగా కూడా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఇవి వినియోగించినప్పటికీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్‌నట్ పై ఉండే పొట్టు:
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి వాల్‌నట్ షెల్‌లు ప్రభావంతంగా సహాయపడుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వాల్‌నట్ షెల్స్‌ని నీటిలో ఉడికించి గోధుమ రంగులో మారే దాకా అలాగే ఉంచాల్సి ఉంటుంది.. ఇలా తయారు చేసిన లిక్విడ్ జుట్టుకు అప్లై చేసి 40నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
గోరింటాకు:
గోరింటాకుతో తయారు చేసిన పొడిని నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా మిశ్రమంలా తమారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత జుట్టును 1 గంట పాటు ఆరనిచ్చి..శుభ్రం చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా అన్ని రకాల జుట్టు సమస్యలు దూరమవుతాయి.
బంగాళదుంప పీల్స్:
బంగాళదుంప పీల్స్‌తో కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పీల్స్ నీటిలో ఊడికించి, ఆ నీటిని జుట్టుకు పట్టిస్తే..బంగాళాదుంప తొక్క నుంచి విడుదలయ్యే స్టార్చ్ తెల్ల జుట్టును సులభంగా నల్లగా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
బ్లాక్ టీ:
బ్లాక్ టీ పొడిని కషాయంలా తయారు చేసి జుట్టు పట్టిస్తే అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు పూర్తగా నల్లగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook