Weight Loss Upma Recipe: బరువు తగ్గే క్రమంలో డైట్ కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసింది. చాలామంది బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్ సెంటర్లను ఆశ్రయిస్తారు. నిజానికి ఇంట్లో ఉండి ఉప్మా తింటూ కూడా సులభంగా బరువు తగ్గొచ్చని కొందరు డైటీషియన్లు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు కూడా అక్కర్లేదు. అయితే డైట్ లో భాగంగా బ్రౌన్ రైస్ రవ్వతో తయారు ఉప్మాను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో తప్పకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని నెలల తరబడి రోజువారి డైట్‌లో ఉప్మా తీసుకుంటే ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి విముక్తి కలిగించి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కలిగిస్తుంది. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా బ్రౌన్ రైస్ ఉప్మాను తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు:
1 కప్పు బ్రౌన్ రైస్ రవ్వ
2 కప్పుల నీరు
1/2 టేబుల్ స్పూన్ నూనె
1/2 టేబుల్ స్పూన్ ఆవాలు
1/2 టేబుల్ స్పూన్ మెంతులు
1 పచ్చిమిరపకాయ, తరిగినది
1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1/2 టీస్పూన్ కరివేపాకు
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
ఉప్పు రుచికి సరిపోయేంత
కొత్తిమీర, తరిగినది
తయారీ విధానం:
రవ్వను నానబెట్టడం:
ముందుగా ఒక పాత్రలో బ్రౌన్ రైస్ రవ్వను వేసి, అదే పాత్రలో 2 కప్పుల నీరు పోసి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి.
తాలూపు తయారు చేయడం:
ఒక కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
ఉప్మా వండడం:
నానబెట్టిన రవ్వను తాలూపులో వేసి బాగా కలపండి. ఉప్పు వేసి మిక్స్ చేసి, మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
సర్వ్ చేయడం:
ఉప్మా బాగా ఊడిన తర్వాత, తరిగిన కొత్తిమీర వేసుకొని మరికొద్ది సేపు బాగా ఉడికించి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోండి.
చిట్కాలు:
బ్రౌన్ రైస్ రవ్వను బాగా నానబెట్టడం వల్ల ఉప్మా మరింత మృదువుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఈ బ్రౌన్ రైస్ ఉప్మాలో కావాలనుకుంటే కూరగాయలు, ఇతర పప్పు దినుసులను కూడా వేసుకోవచ్చు. దీనివల్ల రుచి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.