Weight Loss Idli Recipe In Telugu: బరువు తగ్గాలనుకునే వారు చాలామంది ఆహారాల్లో ఎక్కువగా ఓట్స్ను వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది ఓట్ మీల్ తింటూ ఉంటారు. నిజానికి ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను రెట్టింపు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని మూలకాలు వివిధ రకాల పోషకాలను అందించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయట. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్‌తో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే చాలామందికి ఓట్స్ రోజు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటివారు రోజు ఓట్‌స్‌తో ఇడ్లీలు కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు. వీటితో ఎలా ఇడ్లీలు ఎలా తయారు చేస్తారని ఆలోచిస్తున్నారా? మీకోసం ఈ ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేయబోతున్నాం..
ఓట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి:
కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 1 కప్పు
ఉడికించిన బియ్యం - 1/2 కప్పు
పెరుగు - 1 కప్పు
చిటికెడు ఉప్పు
నీరు - అవసరమైనంత
తయారీ విధానం:
ముందుగా ఈ ఇడ్లీలను తయారు చేయడానికి ఓట్స్ను దాదాపు నాలుగు గంటలకు పైగా నీటిలో బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఓట్స్ను ఒక బౌల్ లోకి తీసుకొని అందులో ఇడ్లీ రైస్ పెరుగు ఉప్పు వేసి మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇడ్లీ పిండి లాగా తయారయ్యేంతవరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మరో ఐదు గంటల పాటు తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ ను తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లిన్ కుక్కర్ లోని ప్లేట్లలో నూనె అప్లై చేసిన తర్వాత ఆ బ్యాటర్ ను అందులో ఫిల్ చేయాలి.
ఇలా ఫీల్ చేసిన తర్వాత స్ట్రీమ్ పై ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది.
ఇలా ఉడికిన ఇడ్లీలను ఒక బౌల్లోకి తీసుకొని.. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
ఈ ఇడ్లీలను ఓట్స్ తోనే కాకుండా జొన్నలు, రాగుల పిండితో కూడా తయారు చేసుకోవచ్చు.
ఓట్స్ తో తయారు చేసిన బ్యాటర్ ను ఫ్రిజ్లో పెట్టుకొని దాదాపు మూడు నుంచి నాలుగు రోజులపాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు.
ఓట్స్ ఇడ్లీలు మరింత రుచిగా ఉండడానికి వాటిపై నెయ్యిని నెయ్యిని వేసి కూడా తయారు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.