Weight Loss Diet: ఈ 5 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ డైట్లో ఉంటే ఈ సమ్మర్‌లో కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు..

Weight Loss Diet: సాధారణంగా సమతుల ఆహారం తీసుకుంటే బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు సూచిస్తారు. ఈ రోజుల్లో కూర్చొని ఎక్కువ గంటలు పని చేయడం కూడా బరువు పెరగడానికి కారణం.

Written by - Renuka Godugu | Last Updated : May 25, 2024, 09:34 AM IST
Weight Loss Diet: ఈ 5 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ డైట్లో ఉంటే ఈ సమ్మర్‌లో కూడా బరువు ఈజీగా తగ్గొచ్చు..

Weight Loss Diet: సాధారణంగా సమతుల ఆహారం తీసుకుంటే బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు సూచిస్తారు. ఈ రోజుల్లో కూర్చొని ఎక్కువ గంటలు పని చేయడం కూడా బరువు పెరగడానికి కారణం. అయితే, ఆహారంలో సరిపోయే ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఏ, సీ, జింక్‌ తీసుకోవాలి అంటారు. కానీ, చాలా వరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గురించి మాట్లాడరు. ఇది మంచి గుండె పనితీరుకు కూడా సహకరిస్తుంది. రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ, ఈ ఖనిజంలో బరువు తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. ఈరోజు అటువంటి 5 ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

సాల్మాన్..
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం ఏంటి? అని అడిగితే మొదటి జాబితాలో వచ్చేది సాల్మాన్‌ ఫిష్‌. ఇందులో ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. సాల్మాన్‌ చేపను మీ డైట్లో చేర్చుకుంటే బరువు ఈజీగా తగ్గిపోతారు.

అవిసె గింజలు..
వాల్నట్స్‌ మాదిరి అవిసె గింజట్లో కూడా ALA, ఒమేగా 3 ఉంటుంది. వీటిని పెరుగు, ఓట్మీల్‌, సలాడ్స్‌ తినేటప్పుడు కూడా పైనుంచి జల్లుకోవచ్చు. వీటిని పొడి రూపంలో తయారు చేసుకుని మీ డైట్లో చేర్చుకోవాలి. ఇందులోని ఒమేగా 3 మన శరీరానికి బూస్టింగ్‌ ఇస్తుంది. ఇందులోని లిగనన్స్ బరువు నిర్వహణలో సహాయపడతాయి. ఉదయం ఖాలీ కడుపున తీసుకుంటే బాడీ మెటబాలిజం బూస్ట్‌ అవుతుంది.

ఇదీ చదవండి:  ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..

చియా సీడ్స్..
మొక్కల ఆధారిత ఒమేగా 3 చియా సీడ్స్‌ లో ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు పెరగకుండా ఉండవచ్చు. ఈ చియా సీడ్స్‌ స్మూథీల్లో, పుడ్డింగ్‌, చియా సీడ్స్‌తో నీటిని తీసుకోవడం వల్ల బరువు నిర్వహణలో ఉంటుంది.

వాల్నట్స్‌..
వాల్నట్స్‌లో అల్ఫా లైనోలినిక్‌ యాసిడ్‌ (ALA) ఉంటుంది. ఇది ఒక రకమైన కొవ్వు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఒమేగా 3 ఇందులో ఉండేది మంచి మొక్కల ఆధారితం.  మీ వెయిట్‌ లాస్‌ డైట్లో వాల్నట్స్‌ చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఓ గుప్పెడు వాల్సట్స్‌ తింటే చాలు మన కడుపు నిండిన అనుభూతి కలిగి ఉంటుంది. అతిగా తినకుంటా ఉంటారు. బరువు కూడా పెరగరు.

ఇదీ చదవండి: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు..  పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..

అవకాడో..
అకకాడో కూడా ఒమేగా 3 కి పవర్‌హౌజ్‌. అవకాడోలో ALA, ఒమేగా 3 కొద్దిమొత్తంలో ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. అంతేకాదు అవకాడోలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి మెటబాలిక్ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ ఒమేగా 3 యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అదనపు బరువు తగ్గిపోతారు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News