Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏ డైట్ మంచిది, దృష్టి పెట్టాల్సిన ఆ నాలుగు ఆహార పదార్ధాలేవి

Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్ లేదా యోగా ఒక్కటే మార్గం కాదు. డైట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వెయిట్ లాస్ సులభతరమౌతుంది. ఆ డైట్ ఏంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2022, 01:27 PM IST
Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏ డైట్ మంచిది, దృష్టి పెట్టాల్సిన ఆ నాలుగు ఆహార పదార్ధాలేవి

Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఎక్సర్‌సైజ్ లేదా యోగా ఒక్కటే మార్గం కాదు. డైట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వెయిట్ లాస్ సులభతరమౌతుంది. ఆ డైట్ ఏంటో చూద్దాం.

ఆధునిక జీవన శైలిలో స్థూలకాయం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డైట్‌పై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే నిరర్ధకమేనంటున్నారు వైద్యులు. బరువు తగ్గాలంటే కేవలం ఎక్సర్‌సైజ్ ఒక్కటే ఎప్పుడూ పరిష్కారం కాదు. డైట్ కూడా మార్చాల్సి ఉంటుంది. మీరు తినే ఆహార పదార్ధాలే మీ శరీరంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఏది తింటే మంచిది..ఏది తినకూడదనేది ఆలోచించకపోతే..స్థూలకాయం వస్తుంది. బరువు తగ్గేందుకు ఏయే ఆహార పదార్ధాల్ని డైట్‌లో చేర్చాలో పరిశీలిద్దాం.

తీపి పదార్ధాలు ఎక్కువగా తింటే బరువు సులభంగా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ స్వీట్స్ లేదా తీపి పదార్ధాలకు సాధ్యమైనంతవరకూ దూరంగా ఉండాలి. తీపి పదార్ధాలతో మీకు అన్ని సమస్యలే ఎదురౌతాయి. కేవలం బరువు పెరగడమే కాదు..బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.

మీ డైట్‌లో ఎక్కువగా ఆకు కూరలు భాగంగా చేసుకోవాలి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా..బరువు కూడా పెరగరు. అందుకే ఎక్కువగా పాలకూర, క్యారెట్,  ఆనపకాయ వంటివాటిని డైట్‌లో భాగంగా చేసుకోవాలి. క్రమం తప్పకుండా వారానికి 3-4 సార్లు కచ్చితంగా తీసుకోవాలి.

ఉదయం మీరు తీసుకునే అల్పాహారం ఎప్పుడూ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. సాధ్యమైనంతవరకూ ఓట్స్, ఎగ్స్ ఉంటే మంచిది. దీంతోపాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదైనా ఫ్రూట్ లేదా జ్యూస్ ఉంటే మరీ మంచిది. దీనివల్ల ఫిట్నెస్ ఉంటుంది.

ఫైబర్ ఫుడ్స్ సాధ్యమైనంతవరకూ తీసుకుంటే మంచిది. దీనివల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు లభించడమే కాకుండా మెటబోలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటిలో బాదం, బ్రోకలీ కూడా చేర్చుకోవచ్చు. బరువు తగ్గడానికి డైట్ ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. 

Also read: Summer Hair Care Tips: వేడి వల్ల జుట్టు మీ పాడవుతుందా..ఈ 7 చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పొందండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News