Watermelon Facepack for Glowing skin: ఎండకాలం రాగానే వేడి పెరిగిపోతుంది. దీంతో దాహం పెరగడం, శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. దీంతో ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తాం. చల్లదనాన్ని ఇచ్చే పండ్లను తింటాం. అందులో పుచ్చకాయకు ప్రథమ స్థానం ఉంటుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే, ముఖాన్ని కూడా ఇది మెరిపిస్తుంది. ఎండకాలం పుచ్చకాయను ముఖానికి అప్లై చేసుకుంటే చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు మిలమిలా మెరుస్తుంది.
పుచ్చకాయను ముఖానికి ఉపయోగించడం వల్ల జిడ్డు పోతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. చెమట వల్ల ఏర్పడిన మచ్చలు, దురద తొలగిపోతుంది. పుచ్చకాయను స్కిన్ కేర్లో వేసవిలో కచ్చితంగా చేర్చుకోవాలి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. వేసవిలో అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు ఉంటాయి. వడదెబ్బ, చెమటను ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కూడా ప్రారంభమవుతుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి వేసవిలో పుచ్చకాయను ఉపయోగించాలి.
ఇదీ చదవండి:ధనియాలను ఇలా తీసుకుంటే వారంలో ఈజీగా బరువు తగ్గిపోతారు..
పుచ్చకాయ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:
మీరు పుచ్చకాయ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి ప్యాక్ మాదిరి వేసుకుంటే వేసవిలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది .ఇది రోజంతా మీ చర్మాన్ని తాజాగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఎండవేడిమికి మీ ముఖం ట్యాన్ అవుతుంది. దీనికి కూడా వాటర్ మిలన్ ఓ చక్కని పరిష్కారం.
కావాల్సిన పదార్థాలు..
తేనె -ఒక చెంచా
పుచ్చకాయను పేస్ట్-అర కప్పు
ఇదీ చదవండి:అలోవెరాతో ఈ 5 ఫేస్‌ప్యాకులు వేసుకోండి.. మీ ముఖం మిలామిలా మెరిసిపోతుంది..
ఈ రెండిటినీ బాగా కలపాలి. ముందుగా మీ ముఖాన్ని శుభ్ర చేసుకోవాలి. ఆ తర్వాత చర్మంపై 15 నిమిషాల పాటు ఈ పేస్టును అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మంచిది.
మీ ముఖాన్ని మృదువుగా కూడా చేస్తుంది. ఓ అరగంట తర్వాత ఫేస్ వాష్ చేయాలి.ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
పెరుగు, పుచ్చకాయలను కలిపి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ను మాస్క్ లాగా వేయండి. ఇది జిడ్డు చర్మం ఉన్నవారు కాకుండా పొడి చర్మం ఉన్నవారు పెట్టుకోవాలి. పెరుగు డెడ్ స్కిన్‌ని తొలగిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter