Vitamins For Bone Health In Telugu: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో ఎముకల సమస్యలు కూడా వస్తున్నాయి. చిన్న వయసులోనే చాలామంది బోలు ఎముకల వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో సులభంగానే విరిగిపోతున్నాయి. నిజానికి ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. వృద్ధాప్య సమయంలో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల దృఢత్వం కోల్పోవడం కారణంగా శరీర అవయవాలు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీర దృఢత్వం కోల్పోయే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్యాల్షియంతో పాటు విటమిన్ డి అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకుంటారు. అయితే వీటికి బదులుగా ఈ క్రింది పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మెగ్నీషియం:
ఎముకలు దృఢంగా ఉండడానికి బాడీ శక్తివంతంగా తయారయ్యేందుకు మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మెగ్నీషియం అధికమవుతాదరు లభించే ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆహారాలు తింటూ వ్యాయామాలు కూడా తప్పకుండా చేయడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
విటమిన్ సి:
పండ్లు కూరగాయల్లో విటమిన్ సి అధికము అవుతాదిలో లభిస్తుంది. అంతేకాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు విటమిన్ సి ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే ఎముకలు కూడా సులభంగా బలోపేతం అవుతాయి. దీంతోపాటు బోలు ఎముకల వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభించే ఆహారాలు తినండి.
విటమిన్ కె:
అన్ని విటమిన్స్ కంటే విటమిన్ కె మన శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే అద్భుతమైన మూలకాలు ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఎముకల దృఢత్వం కోసం ప్రతిరోజు ఆహారంలో తప్పకుండా విటమిన్ కే ఎక్కువగా లభించే ఆకు కూరలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆకుకూరలను తినడం వల్ల కూడా శరీర కండరాల బలహీనత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
జింక్:
జింకు తగిన మోతాదులు లభించే ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఎముకల సమస్యలకు చెక్. ఇందులో ఉండే మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే విటమిన్ బి 12 తీసుకోవడం వల్ల కూడా ఎముకల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన గుణాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఎముకల ఆరోగ్యం కోసం జింక్, విటమిన్ బి 12 కలిగిన ఆహారాలు తప్పకుండా తీసుకోండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి