Facepack: అందమైన.. మృదువైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్

Facepack: అంతర్గత ఆరోగ్యమే కాదు బాహ్య సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయగూరలతో బాహ్య సౌందర్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చు.అదెలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 6, 2022, 06:55 PM IST
Facepack: అందమైన.. మృదువైన చర్మం కోసం ఇంట్లో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్

Facepack: అంతర్గత ఆరోగ్యమే కాదు బాహ్య సౌందర్యం కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కాయగూరలతో బాహ్య సౌందర్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చు.అదెలాగంటే..

బయట ఎండకు ఎక్స్‌పోజ్ అవడం, దుమ్ము ధూళి ప్రాంతాల్లో తిరగడం కారణంగా చర్మం ఎంతగా దెబ్బతింటుందో మనం ఊహించలేం. ముఖ్యంగా ముఖంలో చాలా మార్పులు వస్తాయి. ముఖచర్మం కళా విహీనమై ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో మార్కెట్‌లో లభించే చాలారకాల వస్తువులతో ఫేస్‌ప్యాక్ ట్రై చేస్తుంటారు. కొన్ని మంచి ఫలితాలనిస్తే..కొన్ని దుష్పరిణామాలు కలుగుతాయి. ఈ నేపధ్యంలో మెరుగైన చర్మ సౌందర్యం, మృదువైన చర్మం కోసం బంగాళదుంపలతో ఫేస్‌ప్యాక్ ట్రై చేస్తే మెరుగైన ఫలితాలుంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో చూద్దాం.

బంగాళదుంపలో ఉండే పోషకపదార్ధాలు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి, బి, స్టార్చ్ అనేవి చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తాయి. చర్మానికి మంచి రంగును అందించడమే కాకుండా కాంతివంతం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు దూరమౌతాయి. ముఖంలో యవ్వనం తిరిగి వస్తుంది. అయితే ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖంలో ముడతలు, మచ్చల్ని తొలగించేందుకు ఓ కప్పులో బంగాళదుపం గుజ్జు, పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ముఖానికి ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా రాసుకుని..20 నిమిషాల తరువాత నీళ్లతో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక ఇందులో ఉండే స్టార్చ్ గుణం మంచి బ్లీచ్‌లా ఉపయోగపడుతుంది. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి..ముఖానికి రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాలుంచి ఆ తరువాత కడిగేయాలి. బ్లీచింగ్ కోసం ఇది సహజసిద్దమైన బెస్ట్ ప్రోసెస్. 

చాలామంది అందంగా ఉన్నా చర్మం కాంతి విహీనంగా ఉంటుంది. ఓ కప్పులో బంగాళదుంప రసం, కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని..ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఓ ఇరవై నిమిషాలుంచి..కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్‌ను దూరం చేసేందుకు బంగాళదుంప గుజ్జు, తేనె బాగా కలిపి..ఆ మిశ్రమాన్నికంటి చుట్టూ రాసుకోవాలి. 15-20 నిమిషాలుంచుకుని..తరువాత కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే డార్క్ సర్కిల్స్ కచ్చితంగా దూరమౌతాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఇదే బంగాళదుంప రసంలో కోడిగుడ్డు తెల్లటి సొనను, నిమ్మరసం కలుపుకుని తలకు రాసుకుంటే..జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. 

Also read: Coffee Benefits: కాఫీతో మైగ్రెయిన్ పెయిన్‌కు చెక్ పెట్టేయవచ్చు..ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News