Traditional Holi Colours: హోలీలో సంప్రదాయ రంగులు.. వీటి వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం!

Traditional Holi Colours: హోలీ పండుగ రోజుల చాలా మంది రంగులను చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలుతారు. అయితే కొందరు మాత్రం రసాయనాలు కలిపిన రంగులు చల్లుకునేందుకు ఆసక్తి చూపరు. అలాంటి వారు పసుపు, కుంకుమ, శనగపిండి వంటి సంప్రదాయ రంగులతో ఆనందాన్ని పొందవచ్చు. వాటి వల్ల చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 11:20 AM IST
Traditional Holi Colours: హోలీలో సంప్రదాయ రంగులు.. వీటి వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం!

Traditional Holi Colours: హోలీ పండుగ రానే వచ్చేసింది. ఈరోజున ముఖ్యంగా యువత హోలీ సంబరాల్లో మునిగి తేలుతారు. కానీ, కొందరు మాత్రం హోలీ రంగుల వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే హోలీ రోజున చల్లుకునే రంగుల్లో చాలా వరకు రసాయనాలు కలిపి ఉంటారని వాదనతో పాటు కొన్ని పరిశోధనల్లో అదే విషయం తేలింది. 

దీంతో ఆ రంగులను ఒంటిమీద చల్లుకోవడం ద్వారా చర్మవ్యాధుల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే హోలీ రోజున హిందూ సంప్రదాయ రంగులైన పసుపు, కుంకుమ లేదా వాటిని మిక్స్ చేయగా వచ్చిన రంగుతో సంబరాలు చేసుకోవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

సంప్రదాయ హోలీ రంగుల వల్ల కలిగే ప్రయోజనాలు..

హోలీ రోజున గులాల్ చల్లుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. వేసవి కాలంలో వ్యాధిని వ్యాప్తి చేసే క్రిములు చర్మంపై మరింత చురుకుగా మారుతాయి. ఋతువుల మార్పు కారణంగా.. వేసవిలోని వాతావరణం బ్యాక్టీరియా అనుకూలంగా ఉంటుంది. 

అలాంటి పరిస్థితుల్లో చర్మంపై సంప్రదాయ రంగులైన పసుపు, కుంకుమ వంటి వాటిని చల్లుకోవడం ద్వారా చర్మంపై ఉండే బ్యాక్టీరియా నిర్మూలించే అవకాశం ఉంది. అంతే కాకుండా చర్మంపై రంగులు చల్లుకున్న తర్వాత శుభ్రం చేసుకుంటే.. రంగులతో పాటు చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి కూడా పోతుంది. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. 
వంటల్లో ఉపయోగించే పిండిని కూడా వాడొచ్చు..

హోలీ సందర్భంగా చాలా మంది చెత్త లేదా మురికి నీళ్లను చల్లుకుంటారు. వాటి స్థానంలో పసుపు, కుంకుమ, శనగపిండి వంటి వాటిని చల్లుకోవచ్చు. వాటి వల్ల చర్మం శుభ్రమవుతుంది. వీటిని ఉపయోగించడం ద్వారా గ్రహాల పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. 

(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Empty Stomach Issues: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ పని చేయకండి!

Also Read: Dehydration Symptoms: రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్త పడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News