Health Fruits: మనం నిత్యం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు మనల్ని ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అయితే కొన్ని రకాల పండ్లు మీ డైట్లో ఉన్నాయంటే మీకు వయస్సురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు రావు. అంతేకాదు మీ ముఖం కూడా యవ్వనంగా కనిపిస్తుంది. సాధారణంగా పండ్లలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బెర్రీలు, అవకాడో, దానిమ్మ, కీవీ, యాపిల్ వంటి పండ్లు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది.
ఆరెంజ్..
ఆరెంజ్ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థకు కూడా ప్రేరేపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే ఆరెంజ్‌లో ఫైబర్ కూడా ఉంటుంది.
యాపిల్స్..
యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కరిగే ఫైబర్ ఉంటుంది. అదే పెక్టిన్ ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తాయి. యాపిల్ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
అరటిపండ్లు..
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బీపీ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి. అంతేకాదు కండరాల పనితీరుకు కూడా అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సీ,b6 కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: నల్లాలు తుప్పు పట్టి నీటి మరకలు పేరుకున్నాయా? ఈ రెమిడీతో కొత్తవాటిలా మెరిసిపోతాయి..
కీవీ..
కీవీలో విటమిన్ సీ, కే, డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ఎంతో ముఖ్యం. కీళ్ల ఆరోగ్యానికి, స్కిన్ ఎలాస్టిసిటీని కూడా కీవీ ప్రేరేపిస్తుంది. అంతేకాదు కీవీ పండు డయాబెటీస్ రోగులకు కూడా మంచిది. ఇది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను సైతం బలపరుస్తుంది.
అవకాడో..
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. అవకాడోలో విటమిన్ ఇ, సీ, బీ కాంప్లెక్స్, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని నిర్వహిస్తాయి కూడా. అవకాడోలో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా అవకాడోను తరచూ తీసుకోవడం వల్ల మీ ముఖం కూడా కాంతివంతం అవుతుంది.
ఇదీ చదవండి: ఈ సహజ సిద్ధమైన ఫుట్ స్క్రబ్స్‌తో మీ పాదాలు మృదువుగా మారిపోతాయి..
బెర్రీలు..
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, ఫైబర్ కూడా ఉంటాయి. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు మీ దరిచేరకుండా కాపాడతాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి