Protein Poisoning: మితిమీరిన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే..మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్టు!

కండరాల బలానికి, శరీర ఆకృతికి ప్రోటీన్లను అవసరం తప్పనిసరి. మంచి శరీరాకృతి కోసం కొంత మంది అధిక ప్రోటీన్లను తీసుకుంటున్నారు. వీటి వలన అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2023, 08:50 PM IST
Protein Poisoning: మితిమీరిన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే..మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్టు!

Protein Poisoning: ప్రస్తుతం కాలంలో.. ఆకర్షణీయంగా కనిపించేందుకు గాను.. శరీర ఆకృతిని మార్చుకుంటున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో బరువు తగ్గడం కోసం గంటల తరబడి వ్యాయామం కూడా చేస్తారు. గంటల పాటు వ్యాయామం చేయటానికి ప్రోటీన్ కలిగిన ఆహార పదార్ధాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. 

ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. అంతేగాకుండా ప్రోటీన్ శరీరంలోని కణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.వీటితో పాటుగా చర్మానికి మరియు జుట్టుకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రోటీన్ శరీరానికి ఎంతో మంచి సూక్ష్మ పోషకం. కానీ ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. ప్రోటీన్స్‌ అతిగా తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయ.. దీనిని ప్రోటీన్ పాయిజనింగ్‌ అంటారు.

డైట్ లో ఎంత మొత్తంలో ప్రోటీన్ ఉండాలి..? 
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన  శరీరంలోని ప్రతి కిలోగ్రాములో..  1 గ్రామ్ ప్రోటీన్ ఉండాలి. అంతేకాకుండా శరీరంలో పిండి పదార్థాలు, కొవ్వు పరిమాణం కూడా సరైన స్థాయిలో ఉండాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ప్రొటీన్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయి. 

మితంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు: 

Also Read: Citroen C3 Sales: భారత విపణిలో మరో కొత్త SUV కారు..అతి చౌక ధరతో ప్రీ-ఆర్డర్ సేల్స్ షురూ

బరువు పెరగటం
ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుదలతో బాధపడుతున్నారు. దీని వల్ల తీవ్రంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ  సమస్యలు కలిగే  అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. 

డీహైడ్రేషన్.. 
డైట్ లో కావాల్సిన దాని కన్నా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కలిగే అవకాశం ఉంది. ప్రోటీన్ జీర్ణం అవ్వడానికి శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుండి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. అంతేకాకుండా శరీరం నుండి నీరు కూడా ఎక్కువ పరిమాణంలో బయటకు వస్తుంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. 

డిప్రెషన్.. 
ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం మరియు తక్కువగా కార్బోహైడ్రేట్ లను తీసుకోవడం ద్వారా టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ మరియు నెగటివ్ భావనలు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి హార్మోనులను పెంచి డిప్రెషన్ కి కారణం అవుతుంది.

Also Read: Realme C53 Price: రూ.14 వేల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.649 ధరకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News