Interesting facts about rain: కొంతమందికి వర్షం నచ్చుతుంది కానీ కొందరికి నచ్చదు. వర్షం వల్ల బయటకి వెళ్లే ప్లాన్స్ పా కోపం వస్తుంది. కానీ వర్షం వల్ల సెలవు వచ్చినా, వర్క్ ఫ్రం హోం వచ్చినా చాలా బావుంటుంది. అయితే వర్షం నచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వర్షంలో తడవడం, వర్షంలో వేడి వేడిగా ఏమైనా తినడం, వర్షం లో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం ఇలా చాలా పన్లు చేయచ్చు. అయితే అంత అందమైన వర్షం గురించి ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
భూమిపై వర్షం పడనిచోటు:
ఉత్తర చిలీ, దక్షిణ పెరూలోని అటాకామా ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతం. ఇక్కడ సంవత్సరం మొత్తం మీద కేవలం 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంతేకాకుండా, అంటార్కిటికా లోని మాక్ మర్డో డ్రై వ్యాలీలు ఇంకా పొడిగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో భూమి పై ఒక్క వర్షపు బొట్టు కూడా పడలేదు.
కొన్ని వర్షపు చుక్కలు భూమి మీద పడవు:
వర్షం మేఘాల నుండి కురుస్తుంది అని తెలియని వారు ఉండరు. కానీ అందులోని ప్రతి వర్షపు బొట్టు భూమిని చేరకపోవచ్చు. గాలి పొడిగా ఉన్నప్పుడు వర్షపు చుక్కలు భూమిని చేరేలోపే ఆవిరైపోతాయి. ఈ ప్రక్రియని విర్గా అని అంటారు.
వర్షపు వాసన:
నీటికి సాధారణంగా వాసన ఉండదు, కానీ వర్షం పడేటప్పుడు పెట్టికోర్ అనే ప్రత్యేకమైన వాసన వస్తుంది. ఇది మట్టి తడిచినప్పుడు వస్తుంది. ఈ వాసన జియోస్మిన్ అనే పదార్థం కారణంగా వస్తుంది.
వర్షపు చుక్కల ఆకారం:
వర్షపు చుక్కలు అన్నీ రుద్రాక్ష ఆకారంలో లేక కన్నీటి చుక్కల ఆకారంలో ఉండవు. చిన్న చుక్కలు గుండ్రంగా ఉంటాయి. పెద్ద చుక్కలు బన్ ఆకారంలో ఉంటాయి. ఇంకా పెద్ద చుక్కలు అయితే అవి ప్యారశూట్ ఆకారంలో కూడా ఉంటాయి.
వర్షపు చుక్క బరువు:
ఒక సాధారణ వర్షపు చుక్క బరువు సుమారు 0.034 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది మన కంటి పాప బరువు కన్నా తక్కువ అన్నమాట.
వర్షపు చుక్క భూమిని చేరేందుకు పట్టే సమయం:
వర్షపు చుక్కలు భూమిని చేరడానికి వెళ్లే సగటు వేగం 14 మైళ్లు. 2,500 అడుగుల ఎత్తులో ఉన్న మేఘాల నుండి వర్షపు చుక్కలు భూమిని చేరడానికి సుమారు 2 నిమిషాలు పడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం:
భారతదేశంలోని మేఘాలయా రాష్ట్రంలో మవ్సిన్ రామ్ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాత ప్రాంతం. ఇక్కడ సంవత్సరానికి సగటు 467.4 ఇంచుల వర్షం పడుతుంది. 1985లో మవ్సిన్ రామ్ లో సుమారు 1,000 ఇంచుల వర్షం పడింది.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook