Sleeping in Dark Benefits: మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం సరిపోయినంతగా నిద్ర పోవడం. నిద్ర బాగా పడితే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాం. అయితే సాధారణంగా కొంతమంది తమ పడకగదుల్లో లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. మరికొందరికి లైట్స్ ఆన్ చేసి పడుకోవడం అలవాటు. కానీ, లైట్స్ ఆఫ్ చేసి పడుకునే అలవాటు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మీ దరిచేరకుండా, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది టెన్షన్, యాంగ్జైటీ ని తగ్గిస్తుంది. అంతేకాదు నిద్ర త్వరగా పట్టడానికి సహాయపడుతుంది. గదిలో లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలుసుకుందాం.
మంచి నిద్ర..
మీకు రాత్రి సమయంలో బాగా నిద్ర పట్టాలంటే మీ బెడ్రూంలో మీరు పడుకునే ముందే రెండు గంటలు ముందు లైట్స్ ఆఫ్ చేసి పడుకోండి. ఇలా చేయడం వల్ల మంచి నిద్రకు ఉపక్రమిస్తుంది. దీంతో ఏ ఇబ్బంది లేకుండా ఉదయం వరకు నిద్ర పోతారు.
మానసిక ఆరోగ్యం..
ఇలా లైట్స్ ఆఫ్ చేసిన రూంలో పడుకోవడం వల్ల మీకు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు 7 -8 గంటల పాటు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది మీ ఎనర్జీని బూస్ట్ ఇస్తుంది. అంతేకాదు మీ మూడ్ ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ వర్క్ ఇతర స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది.
ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..
స్లీపింగ్ డిజార్డర్..
రాత్రి పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసి చీకటి గదిలో పడుకోవడం వల్ల ఇన్సోమియా సమస్యలను రాకుండా నివారిస్తుంది. అంతే కాదు రెస్ట్ లెస్ సిండ్రోమ్, ఎపిలెప్సీ, పారాసోమినియా వంటి నిద్ర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్లీప్ ఎప్నీయా సమస్యలు రాకుండా ఉంటాయని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలిపింది.
హార్మోన్ నిర్వహణ..
అంతేకాదు ఇలా చీకటి గదిలో పడుకోవటం వల్ల హార్మోన్ సమస్యలు రాకుండా ఉంటాయి. సర్కార్డియన్ రిథమ్ ఉన్న వాళ్ళకి లైట్ ఉన్న నిద్ర సమస్యలు వస్తాయి ఇలా చీకటి గదిలో పడుకుంటే అలాంటి సమస్యలు ఉండవు.
ఇదీ చదవండి: మీకు కిడ్నీలను క్లీన్ చేసే 8 ఆహారాలు.. పాడవ్వకుండా నిత్యం కాపాడతాయి..
యాంగ్జైటీ తగ్గుతుంది..
గదిలో లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా యాంగ్జైటీ, భయాందోళన గురయ్యే వాళ్ళు చీకటి గదిలో పడుకుంటే నిద్ర సమస్యలు దరిచేరవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి