Walnut For Skin: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. అందుకోసం హెల్తీ ఫుడ్‌ను తీసుకోవడం విశేషం. అయితే దీని కోసం వాల్‌నట్స్ వంటి డ్రైప్రూట్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. వాల్‌నట్స్‌లో శరీరానికి మేలు చేసే చాలా రకాల మూలకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాల్‌నట్స్‌లో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. కావున చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.
1. మృదువైన చర్మానికి వాల్‌నట్స్ ఎలా ఉపయోగపడతాయి:
వాల్‌నట్స్‌లో తొక్కలు చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. ముఖంపై చర్మ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా వాల్‌నట్స్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇది పొడి చర్మం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
2. మచ్చలను తగ్గిస్తుంది:
వాల్‌నట్స్ తొక్కలతో ఫేస్ ప్యాక్‌ను కూడా చేయోచ్చు. ఇది చర్మం లోపల ఉన్న మురికిని శుభ్రంగా చేసేందుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా ముఖంపై మురికి వల్ల ఏర్పడిన మరకలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
3. జిడ్డుగల చర్మం నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
జిడ్డు చర్మానికి వాల్‌నట్స్ పీల్స్ ప్రభావవంగా పని చేస్తాయి. అయితే దీని కోసం వాల్‌నట్స్ తొక్కల నుంచి పొడిని తయారు చేసి.. చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మంపై చనిపోయిన కణాలను తొలగించడానికి దోహదపడుతుంది.
4. వాల్‌నట్ తొక్కల వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు:
వాల్‌నట్స్ మాత్రమే కాదు.. వాటి తొక్కలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి మెరుపును తీసుకురావడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. కావున వీటిని బయట పడేయడం మానుకోండి. వీటిలో ఉండే గుణాలు చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook