Simple Hair Growth Tips: ఆధునిక జీవనశైలి కారణంగా కొంతమందిలో జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది అంతేకాకుండా జుట్టు కూడా రాలిపోతోంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు పురుషులకంటే స్త్రీలలో ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటి జుట్టు సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కొంతమందిలో శరీరంలోని పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. దీని కారణంగా ఉన్న జుట్టు కాస్త రాలిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన ప్రోడక్ట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వాడినప్పటికీ కొంతమందిలో ఎలాంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఇకనుంచి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించి సులభంగా మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకోవచ్చు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రిమ్మింగ్ చెయ్యండి:
కొంతమందిలో జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలోని కాలుష్యం పెరగడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొంతమందిలో జుట్టు పెరగకపోవడమే జుట్టు చివర్ల చీలికపోయి పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆరు నుంచి పది వారాలకు ఒకసారి జుట్టు చివరి భాగాన్ని కత్తిరించాల్సి ఉంటుంది.
వేడి నూనెతో మసాజ్:
జుట్టు అందహీనంగా మారి, పెరుగుదల ఆగిపోయినప్పుడు తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు రోజులకు ఒకసారి జుట్టును వేడి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ పై ఉన్న రంధ్రాలు తెరుచుకొని జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
జుట్టును దువ్వడం:
జుట్టును దువ్వడం వల్ల కూడా స్కాన్ లోని కణాలు ఉత్తేజితమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన జుట్టు పెరుగుదల మళ్లీ మొదలవుతుందని వారంటున్నారు. కాబట్టి జుట్టు పెరుగుదల ఆగిపోయిన వారు తప్పకుండా ప్రతిరోజు రెండుసార్లు జుట్టును దువ్వడం మంచిది. అంతేకాకుండా జుట్టులో ఉన్న మురికిని కూడా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter